24 గంటలు టీకాలు వేయాలి.. ఆర్థిక శాఖ ప్రతిపాదన
24 గంటలు టీకాలు వేయాలి.. ఆర్థిక శాఖ ప్రతిపాదన | దేశ ఆర్థిక పురోగతిని పరుగెత్తించేందుకు కరోనాకు వ్యతిరేకంగా రోజులో 24 గంటలు టీకాలు వేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది.

న్యూఢిల్లీ : దేశ ఆర్థిక పురోగతిని పరుగెత్తించేందుకు కరోనాకు వ్యతిరేకంగా రోజులో 24 గంటలు టీకాలు వేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. టీకా డ్రైవ్‌ను వేగవంతం చేసి సెప్టెంబర్ చివరకల్లా దేశంలో 70 కోట్ల మందికి టీకాలు వేయాలని పేర్కొంది. దేశ ఆర్థిక స్థితిగతులపై గురువారం విడుదల చేసిన నెలవారీ నివేదికలో ఆర్థిక శాఖ ఈ సూచన చేసింది. ఆర్థిక అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలంటే వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, సెప్టెంబర్ కల్లా 70 కోట్ల మందికి టీకాలు అందాలంటే..113 కోట్ల టీకా డోసులు అవసరమవుతాయని ఆర్థిక మంత్రిత్వశాఖ తన నివేదికలో పేర్కొంది. రోజుకు 93 లక్షల మందికి టీకాలు వేస్తే దేశంలో హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని కూడా సూచించింది. ప్రస్తుతం ఉన్న షిఫ్టులను రెండితలు చేయడం, వీలైతే వచ్చే రెండు నెలల పాటూ రోజులో 24 గంటలూ టీకాలు వేయడం ద్వారా రోజు కోటి టీకాలు వేయాలన్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
8 మందికి కొత్త జీవితాన్నిచ్చిన బ్రెయిన్ డెడ్ వ్యక్తి
బెంగళూరు ఐఐఎస్సీ టాప్
విషాదం.. ముంబైలో భవనం కూలి తొమ్మిది మంది దుర్మరణం
నేటి నుంచి తెలంగాణలో యథావిధిగా బ్యాంకుల పని వేళలు
ఘంటసాల రెండో కుమారుడు రత్నకుమార్ కన్నుమూత
దేశంలో కరోనా మరణ మృదంగం.. 24 గంటల్లో 6,148 మంది మృతి
వేలంలో రూ.138 కోట్ల ధర పలికిన బంగారు నాణెం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

