Deputy Secretary Died : కేంద్ర ఆర్ధిక శాఖ డిప్యూటీ సెక్రటరీ నవ్జోత్ సింగ్ (Navjot Singh) దుర్మరణం చెందాడు. ఆదివారం జరిగిన రోడ్డు యాక్సిడెంట్లో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ కాంట్ మెట్రో స్టేషన్ ( Metro Station)సమీపంలో ఆయన బైక్ను బీఎండబ్ల్యూ కారు బలంగా ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన నవ్జోత్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బీఎండబ్ల్యూ కారును ఒక మహిళ నడుపుతున్నారు. యాక్సిడెంట్ చేసిన తర్వాత ఆమె ఒక ట్యాక్సీలో నవ్జోత్ దంపతులను ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆదివారం కావడంతో నవ్జోతో, భార్యతో కలిసి బంగ్లా సాహిబ్ గురుద్వారాను సందర్శించుకున్నారు. అక్కడి నుంచి ఇద్దరు బండి మీద ఇంటికి వెళుతున్నారు.
Navjot Singh, Deputy Secretary in the Department of Economic Affairs, North Block, New Delhi, was killed after being hit by a BMW near Dhaula Kuan. He was declared brought dead at Nuelife Hospital, GTB Nagar.
Eyewitnesses reported that a woman was driving the car that struck… pic.twitter.com/aSSmoRLx6I
— IndiaToday (@IndiaToday) September 14, 2025
వారి వాహనం మెట్రో స్టేషన్ దగ్గరకు రాగనే వెనకాలే వస్తున్న బీఎండబ్ల్యూ కారు గట్టిగా ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వాళ్లను 22 కిలోమీటర్ల దూరంలోని ఆస్పత్రికి తరలించారు. నవ్జోత్ చనిపోగా ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. అయితే.. తమ తల్లిదండ్రులకు యాక్సిడెంట్ చేసిన మహిళ వివరాలను ఆస్పత్రి సిబ్బంది నోట్ చేయకపోవడంపై నవ్జోత్ కుమారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.