అతనో పవర్ఫుల్ పోలీసాఫీసర్. అక్రమాలకు పాల్పడే ఎంతటి వారినైనా ఉపేక్షించడు. సంఘవిద్రోహుల ఆటకట్టించడానికి తనదైన వ్యూహాల్ని అమలుచేస్తుంటాడు. వృత్తిని ఓ పోరాటంలా భావించే ఆ సిన్సియర్ పోలీస్ కథేమిటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు లింగుస్వామి. ఆయన దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ది వారియర్’. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని హీరో రామ్ కొత్త పోస్టర్ను విడుదల చేశారు. ‘రామ్ తొలిసారి పోలీస్ పాత్రను పోషిస్తున్నారు. ఆయన పాత్ర ైస్టెలిష్గా ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్లో నాయకానాయికలపై పాటను చిత్రీకరిస్తున్నాం’ అని నిర్మాత తెలిపారు. కృతిశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సుజీత్ వాసుదేవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా-లింగుస్వామి, సంగీతం: దేవిశ్రీప్రసాద్, యాక్షన్: విజయ్ మాస్టర్, అన్బు-అరివు, కథ, మాటలు, స్క్రీన్ప్లే, దర్శకత్వం: ఎన్.లింగుస్వామి.