అమెరికాతో పోరు ఎప్పటికీ ముగియదు : అల్ ఖైదా
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా తమ సైన్యాన్ని ఉపసంహరించుకుని, అటు టర్కీలో శాంతి సమావేశాలు నిర్వహించినా.. వారితో తమ పోరు ఎప్పటికీ ముగియదు అని అల్ ఖైదా ప్రకటించింది.

వాషింగ్టన్: ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా తమ సైన్యాన్ని ఉపసంహరించుకుని, అటు టర్కీలో శాంతి సమావేశాలు నిర్వహించినా.. వారితో తమ పోరు ఎప్పటికీ ముగియదు అని అల్ ఖైదా ప్రకటించింది. రానున్న రోజుల్లో తాలిబాన్లతో కలిసి తాము ఆఫ్ఘినిస్తాన్ ఆక్రమించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని స్పష్టం చేసింది. సీఎన్ఎన్కు ఇచ్చి ఇంటర్వ్యూలో అల్ ఖైదా ఈ విషయాలను వెల్లడించింది.
అమెరికాలో సెప్టెంబర్ 11 దాడులకు ప్రధాన సూత్రధారి అయిన తమ నాయకుడు ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుపెట్టిన అమెరికాను ఏనాటికి విడిచిపెట్టేది లేదని అల్ ఖైదా తెలిపింది. వారితో తమ పోరాటం ఎప్పటికీ ముగియదని స్పష్టం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైనిక బలగాలు వైదొలిగిన మరుక్షణమే తాలిబాన్ల సాయంతో ఆఫ్ఘనిస్తాన్‌కు వచ్చి ఆక్రమించుకునేందుకు ప్లాన్ చేసుకున్నామని వెల్లడించింది.
ఆఫ్ఘనిస్తాన్‌కు కృతజ్ఞతలు తెలిపిన అల్-ఖైదా ప్రతినిధి, తమ దేశంలోని అన్ని జిహాదీ సంస్థలకు ఆశ్రయం కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి జిహాదీ సంస్థలన్నీ చాలా కాలంగా ప్రపంచంలోని ఇతర ఇస్లామిక్ దేశాలలో కూడా చురుకుగా పనిచేస్తున్నాయి.
సెప్టెంబర్ 11 నుంచి సైన్యం ఉపసంహరణ ప్రారంభం అవుతుందని యునైటెడ్ స్టేట్స్ ప్రకటించింది. అయితే, గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు మే 1వ తేదీ నుంచి తమ సైన్యాన్ని తరలించాడం మొదలుపెట్టాలని తాలిబాన్లు ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నారు. అమెరికా తన బలగాలను వైదొలిగిన అనంతరం ఆఫ్ఘనిస్తాన్‌లో సమస్యలు మరిన్ని పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సైన్యాన్ని ఉపసంహరించుకునే సమయంలో తమ సైనికులపై తాలిబాన్లు పెద్ద ఎత్తున దాడులు జరిపే అవకాశాలు ఉన్నాయని అమెరికాకు బలమైన సమాచారం అందింది. దాంతో నాలుగు బీ -52 ఫైటర్ జెట్లను, ఆర్మీ రేంజర్ టాస్క్ ఫోర్స్‌ను మధ్యప్రాచ్యంలో మోహరించాలని పెంటగాన్ నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి…
మహిళల ఆరోగ్య అవసరాలపై దృష్టి పెట్టాలి: వెంకయ్యనాయుడు
ఆరోగ్యకర జీవితానికి ప్రణాళికలు.. ఇవి పాటిస్తే చాలు హాయిగా ఉండొచ్చు!
కరోనా కాటుకు షూటర్ దాదీ కన్నుమూత
హిమగ్లోబిన్ పెరిగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది.. అందుకు ఏం చేయాలంటే..?
కరోనా ఎక్కడుందన్నాడు.. దానికే బలయ్యాడు.. ఓ ఎమ్మెల్యే కథ
సినిమా మరిచిపోలేని మహా మనీషి.. చరిత్రలో ఈరోజు
సెంకాకు ద్వీపాన్ని సర్వే చేసిన చైనా.. మరోసారి జపాన్‌తో ఉద్రిక్తత
ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు ఎలా గుర్తించాలి?
ఈ విటమిన్ సీ పండ్లు తినండి.. రోగనిరోధక శక్తి పెంచుకోండి..!
అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్‌ను ప్రయోగించిన చైనా
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

