ఐదు మందిపై చిరుత దాడి.. బంధించేందుకు అటవీ సిబ్బంది ప్రయత్నం

భోపాల్: ఒక చిరుత ఐదుగురిపై దాడి చేసింది. రెస్క్యూ కోసం వచ్చిన ఒక పోలీస్‌ను గాయపరిచింది. దానిని బంధించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. న్యూ రాణి బాగ్ ప్రాంతంలోని ఖాండ్వా రోడ్ వద్ద గురువారం ఒక చిరుత పులి హల్చల్ చేసింది. ఒక చిన్నారి, ఆమె తల్లితోసహా ఐదుగురు స్థానికులపై దాడి చేసింది. అనంతరం నిర్మాణంలో ఒక భవనంలోకి ఆ చిరుత ప్రవేశించింది.

విషయం తెలుసుకున్న పోలీసులు, అటవీశాఖ సిబ్బంది దానిని బంధించేందుకు అక్కడకు వచ్చారు. అంతలో ఒక పోలీస్‌పై చిరుత దాడి చేయడంతో స్వల్పంగా గాయపడ్డారు. మత్తు ఇంజక్షన్లు, వలలు ఉన్నప్పటికీ అటవీశాఖ, జూ సిబ్బంది దానిని బంధించలేకపోయారు. ఆ చిరుతను పట్టుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు పోలీస్‌పై చిరుత దాడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
https://www.youtube.com/embed/q9-OqYtFALE
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

