ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ‘కేసీఆర్ మహిళా బంధు’ సంబురాలు అంబరాన్నంటాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించు కొని మూడు రోజులపాటు నిర్వహించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మొదటి రోజు వేడుకలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టడం, పారిశుధ్య కార్మికులను సన్మానించడం వంటివి చేపట్టారు. కొన్ని చోట్ల కేక్‌లు కట్ చేయగా.. ర్యాలీలు కూడా తీశారు. ఏడున్నరేళ్లలో మహిళాభ్యున్నతే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించగా.. పథకాలు, అభివృద్ధిపై లబ్ధిదారులకు వివరించారు. ఈ వేడుకల్లో మంత్రి అల్లోల, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, మార్చి 6 : అంతర్జాతీయ మహిళా దినోత్స వం సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు మహిళలు మహిళాబంధు సంబురాలు ఘనంగా ని ర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కటౌట్లకు రాఖీలు కట్టారు. నిర్మల్ పట్టణంలోని గాయత్రీపురం సీఎం కేసీఆర్ క టౌట్కు, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి రాఖీలు కట్టారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారని మంత్రి అన్నారు. అలాగే పట్టణంలోని ద్యాగవాడ, గాజుల్పేట్, బ్రహ్మపురి, పలు వార్డుల్లో మహిళా బంధు సంబురాలు నిర్వహించారు. మహిళలు కేసీఆర్ చిత్రపటానికి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రా ముకు రాఖీలు కట్టారు. స్థానిక ప్రసూతి దవాఖానలో మహిళా వైద్యులు, నర్సులు చైర్మన్‌ను సన్మానించారు. మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు, స్వయం సహాయక సంఘా ల మహిళలను చైర్మన్ సన్మానించారు. కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు అంగ సోని, కౌన్సిలర్లు పూదరి రాజేశ్వర్, ఖాజామాజీదొద్దీన్, దేవరకోట ఆలయ చైర్మన్ లింగంపల్లి లక్ష్మీ నారాయణ, డైరెక్టర్ పద్మనాభం, గోనె రాజు, నాయకులు గొనుగోపుల నర్సయ్య, శివభూపతి, మహబూబ్, అనిల్, వార్డుల మహిళలు, టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ రూరల్, మార్చి 6 : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తానీషా గార్డెన్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో పలువురు మహిళలను ఎమ్మెల్యే జోగు రామన్న సన్మానించారు. పార్టీ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం మహిళలకు భోజనం వడ్డించిన ఎమ్మెల్యే, వారితో భోజనం చేశారు. అంతకుముందు సీఎం కేసీఆర్ భారీ కటౌట్‌కు రాఖీలు కట్టారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఆశాకుమారి, మిల్కా, కృష్ణవేణి, జడ్పీటీసీ నల్లా వనిత, అరుంధతి రెడ్డి, ఎంపీపీ ఈశ్వరి, మహిళా నాయకులు మమత, స్వరూప, కస్తాల ప్రేమల, పర్వీన్, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ తదితరులు పాల్గొన్నారు.
ముథోల్, మార్చి 6 : ఐకేపీ ఆధ్వర్యంలో ముథోల్‌లో కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో కలిసి మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజేంధర్, ఎంపీపీ అయేషా అఫ్రోజ్ ఖాన్, జడ్పీ వైస్ చైర్మన్ సాగరబాయి రాజన్న, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.