Liquor shops | నూతన మద్యం షాపుల ఫీజులు.. మార్గదర్శకాలు ఖరారు..!
Liquor shops | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రకటించేందుకు సిద్దమైంది. త్వరలో అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. పాత దుకాణాల్లో ఉన్న మద్యం నిల్వలను ప్రస్తుతం విక్రయిస్తున్నారు. గతంలో నిలిచిపోయిన బ్రాండెడ్ మద్యాన్ని తిరిగి అందుబాటులోకి తెస్తున్నారు.
Liquor shops : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రకటించేందుకు సిద్దమైంది. త్వరలో అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనుంది. పాత దుకాణాల్లో ఉన్న మద్యం నిల్వలను ప్రస్తుతం విక్రయిస్తున్నారు. గతంలో నిలిచిపోయిన బ్రాండెడ్ మద్యాన్ని తిరిగి అందుబాటులోకి తెస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు రిటైల్ విధానంలోనే అమ్మకాలు సాగనున్నాయి. అందుకోసం లైసెన్స్ ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది.
నూతన మద్యం పాలసీలో భాగంగా ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. మద్యం ఆదాయ సామర్థ్యాన్ని పెంపొందించే ప్రయత్నంలో భాగంగా మద్యం అమ్మకాల కోసం ప్రైవేట్ రిటైల్ విధానాన్ని అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నూతన విదానం రెండేళ్ల కాలపరిమితిని కలిగి ఉంటుంది. దాంతో రిటెయిలర్ల ఎక్కువ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. రాష్ట్రంలోని 3,736 దుకాణాల్లో గీత కులాలకు 10% అంటే 340 దుకాణాలను కేటాయించే అవకాశం ఉంది. తక్కువ ధరకే నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు స్పష్టం చేసింది.
అదే సమయంలో చీప్ లిక్కర్ క్వార్టర్ సీసా ధరలు తెలంగాణలో రూ.140, కర్ణాటకలో రూ.80, తమిళనాడులో రూ.90, ఒడిశాలో రూ.90గా ఉన్నందున వాటి సగటును పరిగణనలోకి తీసుకుని ఏపీలో క్వార్టర్ రూ.99గా ఉండాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. గత ప్రభుత్వంలో కొత్తగా పుట్టుకొచ్చిన బ్రాండ్లను తొలగించి, వాటి స్థానంలో గతంలో ఉన్న పాపులర్ బ్రాండ్లను ప్రవేశపెట్టనుంది. సాధారణ లిక్కర్ షాపులతోపాటు కేవలం ప్రీమియం రకం మద్యం బ్రాండ్లు దొరికే ఎలైట్ షాపులకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. రాష్ట్రవ్యాప్తంగా 12 ఎలైట్ షాపుల ప్రారంభానికి అనుమతి దక్కనుంది.
మద్యం దుకాణాలకు సంబంధించి ప్రైవేటు వ్యక్తులకు లైసెన్సులు ఇవ్వనున్నారు. ఇప్పటివరకు ఉన్న దుకాణాలను రద్దుచేస్తూ ఆర్డినెన్స్ జారీ చేశారు. నోటిఫికేషన్ విడుదల అనంతరం దరఖాస్తులను ఆహ్వానిం చనున్నారు. దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉంటుంది. ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చే అవకాశం లేదు. అదేవిధంగా ఒకరు ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. జనాభా ప్రాతిపదికన వైన్‌షాపులను నాలుగు కేటగిరీలుగా విభజించారు. పదివేలు జనాభా ఉన్న చోట రూ.50 లక్షలు, 10 వేల నుంచి 50 వేలు ఉన్న చోట రూ.55లక్షలు, 50 వేల నుంచి 5 లక్షలు జనాభా వరకు రూ.65 లక్షలు, 5 లక్షలకుపైన ఉన్నచోట రూ.85 లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణ యించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గ్రామ స్వరాజ్యానికి గ్రహణం.. ఆర్థికంగా కుదేలైన తెలంగాణ పంచాయతీలు.. ఆర్బీఐ నివేదికలో జీపీల దుస్థితి బట్టబయలు
Hyderabad Drinking Water | తెలంగాణ గర్భశోకం.. హైదరాబాద్ సిటీకి జల గండం
Land Resurvey | ప్రతి రైతుభూమీ రీ సర్వే.. అన్నదాతలపై రేవంత్ ప్రభుత్వం మరో కుంపటి
Private School Business | నంబర్-1 నేత కూతురి ‘మైండ్వాల్ట్’.. నంబర్- 2 నేత కుమార్తె ‘మావ్ ఎడ్యూ’.. స్కూళ్ల వ్యాపారం
KLSR Infratech | దివాలా కంపెనీ.. 6వేల కోట్ల బినామీ వైభవం.. రాష్ట్రంలోని కీలక ఇన్ఫ్రా ప్రాజెక్టులన్నీ కేఎల్ఎస్ఆర్కే!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

