హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): నరం లేని నాలుక ఎటువైపైనా మడత పడుతుంది. ఇక రెండు నాల్కలున్న వాళ్ల గురించి చెప్పేదేముంది? రాష్ట్ర బీజేపీ నేతల తప్పుడు ప్రచారం తీరు ఇలాగే ఉన్నది. యాసంగి నుంచి ధాన్యం కొనేది లేదని కరాఖండిగా చెప్పింది కేంద్రం. సాక్షాత్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిసి విన్నవించినా, వారు పెడచెవిన పెట్టారు. రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం పోసుకోలు ముచ్చట్లు చెప్తున్నారు. మొగుణ్ణికొట్టి మొగసాలకెక్కినట్టు.. కేంద్రంలో తమ పార్టీ చేస్తున్న పాపాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అంటగట్టాలని చూస్తున్నారు.
బుధవారం హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. వడ్లు కొనబోమని ఎఫ్‌సీఐ చెప్పిందా? వరి వెయ్యొద్దని చెప్పడానికి మీరెవరంటూ.. తెగ మాట్లాడారు. వడ్లను కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని, అవసరమైతే అదనంగా కొనిపించేందుకు కూడా తాము బాధ్యత తీసుకొంటామని బీరాలు పలికారు. ‘ఏరు దాటేదాక ఓడ మల్లన్న.. దాటిన తర్వాత బోడ మల్లన్న’ అన్నట్టే బండి మాటలున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో వరదల్లో కొట్టుకొనిపోయిన కారుకు కొత్త కారు కొనిస్తామని చెప్పిన సంజయ్.. ఎట్లా ఇప్పిస్తారంటే.. కారు ఇన్సూరెన్సు ఉంటది కదా.. అదే ఇప్పిస్తానన్న మాటలు ఎవరు మర్చిపోగలరు? ఇప్పుడు హుజూరాబాద్‌లో వడ్ల ముచ్చట చెప్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ వడ్లు కొనేది లేదంటుంటే.. ఈయనేమో, అదనంగా కూడా కొంటమని చెప్పడం రైతులను రెచ్చగొట్టి నట్టేట ముంచడం కాక మరేమిటి? ‘మా వద్ద నాలుగైదేండ్లకు సరిపడా ఉప్పుడు బియ్యం నిల్వలున్నాయి. కాబట్టి ఈ ఏడాదిలో ముఖ్యంగా యాసంగిలో ఉప్పుడు బియ్యం (దొడ్డు వడ్లు) కొనే ప్రసక్తే లేదు. యాసంగిలో రైతులను వరిసాగు నుంచి తప్పించి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించండి’ ఇదీ ధాన్యం కొనుగోలుపై సాక్షాత్తూ కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఆగస్టు 31న రాష్ర్టానికి రాసిన లేఖ సారాంశం. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి ఇంతకంటే సాక్ష్యం వేరే కావాలా?
వాస్తవం: ఈ యాసంగిలో ఉప్పుడు బియ్యం(దొడ్డు వడ్లు) కొనే ప్రసక్తే లేదని ఆగస్టు 31న కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శి సుధాన్షు పాండే తెలంగాణ ప్రభుత్వానికి అధికారికంగా లేఖ రాశారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్‌లో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్.. నాణ్యమైన ధాన్యాన్నే కొంటామన్నారు.
వాస్తవం: గత యాసంగిలో 62 లక్షల టన్నుల సీఎమ్మార్ తీసుకోవాల్సి ఉండగా, ఎఫ్‌సీఐ 24.75 లక్షల టన్నులు మాత్రమే తీసుకొంటామని మొండికేస్తే.. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, గంగుల కేంద్రాన్ని ఒప్పించారు. కేంద్రమంత్రి పీయూష్ గో యల్ను సీఎం కేసీఆర్ సెప్టెంబర్ 25న కలిసి మరో 20 లక్షల టన్నులు తీసుకొనేందుకు ఒప్పించారు. వానకాలంలోనూ ఇదే పరిస్థితి తలెత్తితే మళ్లీ కేంద్రా న్ని ఒప్పించాల్సి వచ్చింది. ఈ రెండు సందర్భాల్లో బండి సంజయ్ ఎక్కడున్నారు? ఇప్పుడైనా.. ఎప్పు డో బాధ్యత తీసుకొంటామంటున్నారే కానీ.. ఢిల్లీకి పోవడానికి రెండు గంటలైనా పట్టదే.. పోయి మా ట్లాడి రావొచ్చుకదా. ఈ విషయంలో బండి సం జయ్ ఒక్కటంటే ఒక్కసారైనా కేంద్రంలో ప్రధానిని, మంత్రులను కలిసి విజ్ఞప్తి చేశారా?
వాస్తవం: అవును.. యాసంగిలో దొడ్డుబియ్యం కొనేది లేదని ఆగస్టు 24న రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి సమక్షంలో జరిగిన సమావేశంలో ఎఫ్‌సీఐ జీఎం దీపక్‌శర్మ కుండబద్దలు కొట్టారు. గత యాసంగికి సంబంధించిన సీఎమ్మార్‌ను కూడా తీసుకొనేది లేదన్నారు. సెప్టెంబర్ 8న మరోసారి దీపక్‌శర్మ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు. పైగా రైతులను వరిసాగుకు దూరంగా ఉంచాలని సలహా ఇచ్చారు.
వాస్తవం: ఈ మాట అనాల్సింది బీజేపీ పెద్దలతో.. కేంద్ర సర్కారుతో.. వడ్లు కొనం అన్నది కేంద్రమే. నువ్వు గల్లా పట్టాల్సింది ఢిల్లీలో మీ నాయకులనే! వాళ్లతో మాట్లాడటం చేతకాక, చేవలేక.. ఇక్కడ గల్లీలో కూర్చొని గల్లాల గురించి పేలుతున్నారు.
వాస్తవం: ఈ మాట చెప్పాల్సింది బండి సంజయ్ కాదు. ఇక్కడి రైతులకు పిలుపు ఇచ్చేముందు.. కేంద్రంతో, ఎఫ్‌సీఐతో హామీ ఇప్పించాలి. మీరు పండించిన ధాన్యాన్నంతా కొంటామని ఒక్కమాట చెప్పించాలి. సాగునీళ్లిస్తే మన రైతులు వరిని ఏ స్థాయిలో పండిస్తారో ఈయనగారి పాదయాత్రలో కండ్ల నిండా కనిపించింది కదా! ఇప్పుడు ఈయన ఇచ్చిన హా మీతో రైతులు వరి పండించి.. ఆ తర్వాత కేంద్రం కొనకపోతే వాళ్ల బాధలకు బండి బాధ్యత వహిస్తారా? తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం రైతులను రెచ్చగొట్టి తర్వాత నట్టేటా ముంచడమే కాదా ఇది! అన్నం పెట్టే చెతులెప్పు డూ తినే కంచాన్ని గుంజుకోవు. రాష్ట్రంలో ప్రస్తుతం వ్యవసా యం సుభిక్షం గా ఉండేందుకు, రైతులు సంతోషంగా ఉండేందుకు కారణం ఎవరు? సీఎం కేసీఆర్ కాదా? రైతన్నకు గుండెనిండా భరోసా నింపిన వ్యక్తి.. ఇప్పుడు అదే రైతును ముంచేందుకు యత్నిస్తడా? దేశీయంగా, అంతర్జాతీయంగా, కేంద్ర ప్రభుత్వ వైఖరుల నేపథ్యంలో వరి సాగు చేస్తే భవిష్యత్‌లో రైతులు ఇబ్బంది పడుతారనే ఉద్దేశంతోనే ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సూచిస్తున్నా రు. రైతు భవిష్యత్తే ఆయనకు ముఖ్యం. అందుకు ఆయన తీసుకొన్న చర్యలే తార్కాణం. బీజేపీకి మాత్రం రాజకీయమే పరమావధిగా మారింది.