ఇస్తాన్‌బుల్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసమ్మతివాదులు, విపక్ష జర్నలిస్టులు, ప్రభుత్వ వ్యతిరేక బృందాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ నిఘా సంస్థ టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ ద్వారా మాల్వేర్ను ప్రయోగిస్తున్నదని ఎఫ్‌బీఐ వెల్లడించింది. ఇరాన్ నిఘా, భద్రతా శాఖ తరఫున పనిచేస్తున్న వ్యక్తులు మాల్వేర్ను పంపిణీ చేయడానికి టెలిగ్రామ్‌ను కమాండ్ అండ్ కంట్రోల్ మౌలిక సదుపాయంగా ఉపయోగిస్తున్నారని శుక్రవారం ఎఫ్‌బీఐ తెలిపింది. అవాంఛిత సంభాషణల విషయంలో కస్టమర్లు జాగ్రత్త వహించాలని, తమ పరికరాలు, సాఫ్ట్వేర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని, విశ్వసనీయ మూలాల నుండి మాత్రమే అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవాలని, యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌ను అనేబుల్ చేసుకోవాలని, మల్టీఫ్యాక్టర్ అథెంటికేషన్‌తో బలమైన పాస్‌వర్డ్‌లను ఉపయోగించాలని ఎఫ్‌బీఐ సూచించింది.