Fauzi | పాన్ ఇండియా స్టార్ రెబల్‌స్టార్ ప్రభాస్ ఈరోజు (అక్టోబర్ 23) తన 46వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. ప్రతి ఏడాది ప్రభాస్ బర్త్‌డే అంటే ఫ్యాన్స్‌కి పండగే. ఈసారి కూడా అభిమానులు ఎప్పటిలానే సినిమా అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది. దర్శకుడు హను రాఘవపూడితో ప్రభాస్ చేస్తున్న కొత్త చిత్రానికి ‘ఫౌజీ (Fauji)’ అనే టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. కొద్ది సేపటి క్రితం మేకర్స్ అద్భుతమైన పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో ప్రభాస్ లుక్ పవర్‌ఫుల్‌గా, వింటేజ్ వారియర్ స్టైల్లో ఆకట్టుకుంటోంది.
పోస్టర్‌పై ఉన్న క్యాప్షన్ చూస్తే.. “పద్మవ్యుహాన్ని జయించిన పార్థుడు (అర్జునుడు), పాండవ పక్షంలో నిలిచిన కర్ణుడు,గురువు లేకుండానే యుద్ధ కళలో నిపుణుడైన ఏకలవ్యుడు ..జన్మతః యోధుడు ఇతనే.” అని రాసి ఉంది. ఈ మాటలతోనే మేకర్స్ ప్రభాస్ పాత్రలోని యోధ స్వభావం, దేశభక్తి, తిరుగుబాటు స్పూర్తి ఎలా ఉండబోతుందో క్లూస్ ఇచ్చారు. ‘సీతారామం’ వంటి క్లాసిక్ లవ్ స్టోరీని తెరకెక్కించిన హను రాఘవపూడి ఈసారి యాక్షన్, ఎమోషన్ల మిశ్రమంగా ఉన్న ఒక ఎపిక్ వార్ డ్రామాను సిద్ధం చేస్తున్నారని తెలుస్తోంది. ‘ఫౌజీ’లో ప్రభాస్ పాత్రలో గంభీరత, ధైర్యం, త్యాగం ఇవన్నీ ప్యాకేజీగా ఉండబోతున్నాయని అభిమానులు అంచనా వేస్తున్నారు.
టైటిల్ పోస్టర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో #Fauji మరియు #Prabhas46thBirthday ట్రెండింగ్‌లోకి వచ్చాయి. అభిమానులు “ఇది హనూ రాఘవపూడి విజువల్ మాస్టర్‌పీస్ అవుతుంది”, “ఫౌజీ లుక్‌లో ప్రభాస్ ఫైరింగ్ లుక్‌లో కనిపిస్తున్నారు!” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి, ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన ‘ఫౌజీ’ టైటిల్ పోస్టర్ అభిమానుల అంచనాలను ఆకాశానికెత్తింది. హను రాఘవపూడి – ప్రభాస్ కాంబినేషన్లో మరో క్లాసిక్ బ్లాక్‌బస్టర్ పుట్టబోతోందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.