సంగారెడ్డి, మే 16: ఒకటి రెండు కాదు.. ఏకంగా 300 రకాల మామిడి పండ్లు, కాయ లు నోరూరించాయి. ఆ మామిడి పండ్లను చూసిన వారు ఎప్పుడెప్పుడు రుచి చూద్దామా అని నోరూరించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో శనివారం సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేంద్రంలో మామిడి పండ్ల ఫల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఇందు లో 300లకు పైగా మామిడి రకాలు ప్రదర్శించారు. సంగారెడ్డి అస్తబల్లోని ఫల పరిశోధన కేంద్రంలో మామిడి పండ్ల ప్రదర్శనను శనివారం అధికారులతో కలిసి నిలదొక్కుకోవాలని రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి ప్రా రంభించారు.
సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేంద్రంలో 300లకు పైగా మామిడి రకాలు ఉన్నాయని, శాస్త్రవేత్తల సూచనలు, సలహాలతో మొక్కలు తీసుకెళ్లి మా మిడి సాగుపై రైతులు దృష్టి సారించాలని నాగిరెడ్డి సూచించారు. ఏటా ప్రదర్శన ఏర్పాటు చేసి, రైతులకు మామిడి సాగుపై మెళకువలు వివరిస్తూ, ప్రోత్సహించడం మంచి నిర్ణయం అని అభినందించారు. గతంలో పెద్దపెద్ద మామిడి చెట్లు పెరిగి పండ్లను కొసేవారని, మారుతున్న కాలానికి సాంకేతిక పరిజ్ఞానంతో శాస్త్రవేత్తలు కొత్త వంగడాలు సృష్టించి రైతులకు అందజేస్తున్నారని తెలిపారు.
దీంతో తక్కువ కాలంలో అధిక దిగుబడులు సాధిస్తు ఆర్థికంగా రైతులు బలపడుతున్నారని గుర్తుచేశారు. అనంతరం ఏర్పా టు చేసిన మామిడి పండ్ల ప్రదర్శనను ఆయన తిలకించారు. ఆదివారం (నేడు) మామిడి పండ్ల ప్రదర్శన నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఫల పరిశోధన కేంద్ర సీనియర్ సైంటిస్ట్ వెంకటలక్ష్మి, వివిధ రకాల శాస్త్రవేత్తలు, రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.