Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Farmers Protest | సుద్ద వాగు బ్యాక్‌వాటర్ ద్వారా సాగునీటిని వినియోగించుకుంటూ పంటలు పండిస్తున్న రైతులకు నీటి సరఫరాలో ఆటంకాలు కల్పించవద్దని డిమాండ్ చేస్తూ శుక్రవారం కుభీర్ మండలంలోని మాలేగాం, కుంభి, లింగి గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన చేపట్టారు.
కుభీర్: సుద్ద వాగు ( Sudda Vagu ) బ్యాక్‌వాటర్ ద్వారా సాగునీటిని వినియోగించుకుంటూ పంటలు పండిస్తున్న రైతులకు నీటి సరఫరాలో ఆటంకాలు కల్పించవద్దని డిమాండ్ చేస్తూ శుక్రవారం కుభీర్ మండలంలోని మాలేగాం, కుంభి, లింగి గ్రామాలకు చెందిన రైతులు ఆందోళన (Farmers Protest ) చేపట్టారు. మాలేగాం గ్రామ సమీపంలో మొండి బసవన్న వద్ద మలేగాం సర్పంచ్ శేల్కె లక్ష్మీ ఆనంద్, మాజీ సర్పంచ్ కే రేఖ శంకర్ ఆధ్వర్యంలో సుద్ద వాగు బ్యాక్ వాటర్ పరివాహక ప్రాంత రైతులు ప్రధాన రహదారిపై బైఠాయించారు. తమకు సాగునీరు అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలకు ప్రస్తుతం నీరు అత్యవసరమని తెలిపారు. ఇప్పటికే పంటల సాగు కోసం పెట్టుబడులు పెట్టామని, పంటలు చేతికి వచ్చే సమయంలో నీటిని నిలిపివేస్తే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఖరీఫ్ లో సాగుచేసిన పసుపు, శనగ, పొద్దు తిరుగుడు పంటలను సాగు చేసుకున్న రైతులు వాటి ఎదుగుదలకు అవసరమైన నీరు అందకపోతే పంటలు చేతికి రావన్నారు.
పంటలు చేతికి వచ్చే వరకు సుద్ద వాగు బ్యాక్‌వాటర్ ద్వారా సాగునీటిని వినియోగించు కునేందుకు ఎలాంటి అడ్డంకులు కల్పించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకొని మోటార్ల తొలగింపు నిర్ణయంపై పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు .
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్‌గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్‌బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

