హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని తాటిపర్తి గ్రామంలో జరుగుతున్న ఫార్మా పనులను రైతులు అడ్డుకున్నారు. అక్రమంగా ఫార్మా భూముల్లో చదును చేసేందుకు గ్రామానికి పదుల సంఖ్యలో వచ్చిన జేసీబీలు, డోజర్లను అడ్డుకున్నారు. కోర్టు స్టే ఉన్న భూముల్లో ఎలాంటి పనులు చేయొద్దని స్థానిక ప్రజలు బుల్డోజర్లను వెనక్కి పంపారు.
కాగా, గ్రామానికి చెందిన చిట్టి నాగమణి అనే మహిళా రైతు ఫార్మాకు భూమిని ఇవ్వలేదు. సర్కార్ నుంచి పరిహారమూ తీసుకోలేదు.. పోలీసుల సహకారంతో బలవంతంగా భూమిని చదును చేసేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న ప్రజలు అక్కడికి వెళ్లి జేసీబీలు, డోజర్లు పొలాలకు రాకుండా అడ్డుకున్నారు.
రంగారెడ్డి జిల్లాలో ఫార్మా పనులను అడ్డుకున్న రైతులు
యాచారం మండలంలోని తాటిపర్తి గ్రామంలో జరుగుతున్న ఫార్మా పనులను అడ్డుకున్న రైతులు
అక్రమంగా ఫార్మా భూముల్లో చదును చేసేందుకు గ్రామానికి పదుల సంఖ్యలో వచ్చిన జేసీబీలు, డోజర్లను అడ్డుకొని కోర్టు స్టే ఉన్న భూముల్లో ఎలాంటి పనులు… https://t.co/BPEevvZM2i pic.twitter.com/8Eva4ovepW
— Telugu Scribe (@TeluguScribe) June 4, 2026