యూరియా కోసం రైతుల తిప్పలు.. క్యూలైన్లో చెప్పులు
నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరు సింగల్ విండో కార్యాలయానికి బుధవారం 300 బస్తాల యూరియా రావడంతో ఇప్పటికే ఎదురుచూస్తున్న రైతులు భారీగా అక్కడికి చేరుకున్నారు.
మరికల్ : నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని తీలేరు సింగల్ విండో కార్యాలయానికి బుధవారం 300 బస్తాల యూరియా రావడంతో ఇప్పటికే ఎదురుచూస్తున్న రైతులు భారీగా అక్కడికి చేరుకున్నారు. యూరియా కొనుగోలు కోసం తిప్పలు పడుతున్నారు. చెప్పులను, వాటర్ బాటిల్లను క్యూలైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్నారు. స్పందించిన సిబ్బంది ఒక్కో రైతుకు మూడు బస్తాల చొప్పున యూరియాను పంపిణీ చేశారు.
ఒక బస్తా యూరియాను రూ.267కు విక్రయించారు. కోయిల్ సాగర్ తీర ప్రాంతంలో రైతులు అధిక మొత్తంలో వరిసాగు చేస్తుండటంవల్ల యూరియా కొరత ఏర్పడింది. ప్రభుత్వం రైతులకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో యూరియా లభించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
ప్రభుత్వ వైఫల్యంతోనే యూరియాకు కృత్రిమ కొడత ఏర్పడిందని రైతులు విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రైతులకు యూరియా అందుబాటులో ఉంచి ఇబ్బందులను తీర్చాలని కోరుతున్నారు. యూరియా కోసం పెద్ద ఎత్తున సహకార సంఘానికి రైతులు చేరుకున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

