జహీరాబాద్, ఆగస్టు 20: జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టులోని స్మార్ట్‌సిటీ కోసం సేకరించిన భూముల్లో మౌలిక వసతుల అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేందుకు పంచాయతీల అధికారాలను టీఎస్ఐఐసీకి అప్పగించాలని పంచాయతీరాజ్, గ్రామీ ణ అభివృద్ధి శాఖాధికారులు ఉత్తర్వులను జారీచేశారు. ఈ ఉత్తర్వుల్లో నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూములకు కాకుండా ఎలాంటి సమాచారం లేకుండా 943 ఎకరాల పట్టా భూముల సర్వే నంబర్లను పేర్కొనడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లోని నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించిన భూ ముల్లో స్మార్ట్‌సిటీతో పాటు పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వసతులను వేగంగా చేపట్టేందుకు పంచాయతీ అధికారులను టీఎస్ఐఐసీకి అప్పగించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రాష్ట్ర కమిషనర్ ఆదేశాల మేరకు గురువారం సం గారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్ పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గం, గ్రామ రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు లు మాట్లాడుతూ ఇదివరకే గ్రామంలోని 512 ఎకరాల పట్టా, ప్రభుత్వ భూములను తీసుకున్నారని, తాజాగా 943 ఎకరాల భూముల పట్టా భూముల వివరాలను ఎలాంటి సమాచారం లేకుండా ఉత్తర్వుల్లో పేర్కొనడం ఏమిటని ప్రశ్నించారు.
పట్టా భూములను నిమ్జ్, స్మార్ట్‌సిటీ కోసం సేకరించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రాష్ట్ర కమిషనర్ ఉత్తర్వులలో పేర్కొన్న 943 ఎకరాల పట్టా భూములకు సంబంధించి నిమ్జ్ ప్రాజెక్టు, మండల రెవెన్యూ అధికారుల దృష్టికి ప్రజాప్రతినిధులు, రైతులు తీసుకెళ్లాగా ఆ భూముల సర్వే నంబర్ల గురిం చి తమకేమీ తెలియదంటూ దాటా వేశారు. దీంతో గ్రామానికి చెందిన బాధిత రైతుల తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సర్పంచ్ ఎంఆర్ ప్రవీణ్‌కుమార్ ఆధ్యక్షత ఏర్పాటు చేసిన సమావేశంలో నిమ్జ్ ప్రాజెక్ట్టు, స్మార్ట్‌సిటీల కోసం సేకరించిన భూముల్లో మౌలిక వసతులు వేగవంతం చేసేందుకు అధికారులను టీఎస్ఐఐసీ అప్పగించవద్దని ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికీ తీసుకెళ్తామని పంచాయతీ కార్యదర్శి ధన్‌రాజ్ పేర్కొన్నారు. తమ జీవనాధారమైన భూముల జోలికి వస్తే సహించేది లేదని, భూములను కాపాడుకునేందుకు ఎంతవరకైనా పోరాడానికి వెనుకంజ వేసేదేలేని రైతులు తెల్చిచెప్పారు. కార్యక్రమంలో హద్నూర్, మల్కన్పాడ్ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు పాల్కొన్నారు.