Faria Abdullah | తెలుగు సినిమా రంగంలో గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా, నటన, డ్యాన్స్, మ్యూజిక్ వంటి విభిన్న అంశాల్లో తన ప్రత్యేకతను చూపిస్తున్న హీరోయిన్లలో ఫరియా అబ్దుల్లా ఒకరు. అందంతో పాటు అభినయంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరుచుకుంటున్నారు. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, తనలోని ప్రతిభను విస్తరించుకుంటూ ముందుకు సాగుతున్న ఫరియా, తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుని వార్తల్లో నిలిచారు.
2021లో విడుదలైన జాతిరత్నాలు చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది ఫరియా. ఆ సినిమాలో ‘చిట్టి’ పాత్రతో ఒక్కసారిగా ఫేమ్ అందుకున్న ఫరియా, ఆ తర్వాత తన ప్రతిభకు తగ్గ పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, బంగర్రాజు, రావణాసుర, ఆ ఒక్కటి అడక్కు, కల్కి, మత్తు వదలరా 2, గుర్రం పాపిరెడ్డి, అనగనగా ఒకరోజు వంటి చిత్రాల్లో నటించి, నటిగానే కాకుండా తన వర్సటాలిటీని నిరూపించుకున్నారు. ముఖ్యంగా మత్తు వదలరా 2, గుర్రం పాపిరెడ్డి సినిమాల్లో ఆమె చేసిన ర్యాప్ పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. డ్యాన్స్, మ్యూజిక్, ర్యాప్లోనూ ఫరియా చూపుతున్న ఆసక్తి ఆమెను మిగతా హీరోయిన్లకు భిన్నంగా నిలబెడుతోంది.
ఇటీవల ఓ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా అబ్దుల్లా, తన లవ్ లైఫ్ గురించి చాలా ఓపెన్‌గా మాట్లాడారు. ప్రస్తుతం తాను ప్రేమలో ఉన్నానని వెల్లడించిన ఆమె, ఆ రిలేషన్షిప్ తన పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ లైఫ్‌ను కూడా బ్యాలెన్స్ చేయడంలో ఎంతో సహాయపడుతోందని చెప్పారు. తన జీవితంలో ఈ దశకు ప్రేమే ప్రధాన ప్రాధాన్యతగా ఉందని ఫరియా పేర్కొన్నారు.ఇంకా తన ప్రియుడి గురించి మాట్లాడుతూ, అతడు ముస్లిం కాదని, హిందూ యువకుడని స్పష్టం చేశారు. అతడు తన బాల్య స్నేహితుడు కాదని, సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తేనని తెలిపారు. తాను ప్రేమిస్తున్న వ్యక్తి ఒక యంగ్ కొరియోగ్రాఫర్ అని, ఇద్దరూ కలిసి వర్క్ చేస్తూ ఒక టీమ్‌లా ముందుకు సాగుతున్నామని చెప్పారు. తన మ్యూజిక్, డ్యాన్స్, ర్యాప్‌లో వచ్చిన అభివృద్ధికి అతడిచ్చే ప్రోత్సాహమే కారణమని ఫరియా స్పష్టంగా చెప్పడం గమనార్హం.తమ మధ్య ఉన్న బంధాన్ని కేవలం లవ్ అఫైర్‌గా మాత్రమే చూడనని, అది జీవిత భాగస్వామ్యానికి సంబంధించిన అండర్‌స్టాండింగ్‌గా భావిస్తానని ఫరియా అభిప్రాయపడ్డారు.