USA vs PAK : పొట్టి ప్రపంచకప్ రెండో మ్యాచ్‌లోనూ అమెరికా పేసర్ శాడ్లీ వాన్(4-25) వికెట్ల వేటతో రెచ్చిపోయాడు. కొలంబోలోని సింహలీస్ స్పోర్ట్స్ క్లబ్లో పాకిస్థాన్ బ్యాటర్లను బోల్తా కొట్టించిన అతడు.. 190కి పాక్‌ను కట్టడి చేయడంలో కీలకమయ్యాడు. యూఎస్ఏ బౌలర్లును సమర్ధంగా ఎదుర్కొన్న ఓపెనర్ ఫర్మాన్(73) అర్ధ శతకంతో రాణించగా.. బాబర్ ఆజాం(46) ఫామ్ చాటుకుంటూ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. డెత్ ఓవర్లలో షాదాబ్ ఖాన్(30) దంచేశాడు. దాంతో.. పాక్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి190 పరుగులు చేసింది.
తొలి పోరులో నెదర్లాండ్స్‌పై అతికష్టమ్మీద గెలుపొందిన పాకిస్థాన్ రెండో మ్యాచ్‌లో భారీ స్కోర్ కొట్టింది. యూఎస్ఏ పేసర్ శాడ్లీ వాన్(4-25) ఆరంబంలోనే విజృంభించగా ఓపెనర్ సయీం ఆయూబ్() డగౌట్ చేరాడు. కాసేపటికే కెప్టెన్ సల్మాన్ అఘా() సైతం పెద్ద షాట్‌కు యత్నించి బౌండరీ వద్ద దొరికాడు. పవర్ ప్లేలో 56కే రెండు వికెట్లు పడిన వేళ ఫర్మాన్(73), మాజీ సారథి బాబర్ ఆజాం(46) లు క్రీజులో నిలిచారు. బౌండరీలతో రెచ్చిపోయిన ఫర్హాన్ అర్ధశతకం సాధించాడు.
Five wickets fall in the last two overs, but Pakistan have their highest #T20WorldCup total since 2016 💪
Follow the USA chase: https://t.co/lI9OOynhz0 pic.twitter.com/W073VqXGPX
— ESPNcricinfo (@ESPNcricinfo) February 10, 2026
ఫిఫ్టీ తర్వాత మరింత దూకుడు పెంచిన అతడికి పోటీగా.. బాబర్ సైతం దంచేశాడు. దాంతో.. మూడో వికెట్‌కు ఈ ద్వయం 70 రన్స్ జోడించింది. హాఫ్ సెంచరీకి చేరువైన బాబర్‌ను మొహ్సిన్ పెవిలియన్ పంపగా.. ఆ వెంటనే ఫర్హాన్ ఔటయ్యాడు. అనంతరం.. షాదాబ్ ఖాన్(30) బ్యాటు ఝులిపించడంతో పాక్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190 రన్స్ చేసింది.
Career-best figures for USA’s Shadley van Schalkwyk as Pakistan wickets tumble at the death! https://t.co/lI9OOynhz0 | #T20WorldCup pic.twitter.com/deks53OwFd
— ESPNcricinfo (@ESPNcricinfo) February 10, 2026