సిరిసిల్ల రూరల్ : ప్రతి ఒక్కరు కుటుంబ భద్రత కోసం బీమా (Safety Insurance ) చేయాలని ఎస్బీఐ లైఫ్ సిరిసిల్ల బ్రాంచి మేనేజర్ ప్రభాకర్ ( Manager Prabhakar ) కోరారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన తడిగొప్పుల శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందగా అతడి భార్యకు బీమా చెక్కు ( Insurance Check )ను అందజేశారు.
శ్రీనివాస్ రెండు సంవత్సరాల క్రితం ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో రూ.55 వేల తోస్మార్ట్ స్కాలర్, రూ.లక్షతో స్మార్ట్ ఫ్యార్పూన్ బిల్లర్ పాలసీని తీసుకున్నాడు. ఇటీవ పాలసీదారుడు శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందగా భార్య,పిల్లలకు రూ.15.50లక్షలు భార్య ఖాతాలో జమచేసి చెక్కును అందజేశారు.
ఈసందర్భంగా బ్రాంచి మేనజర్ ప్రభాకర్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి పాలసీ 20 ఏళ్ల పాటు
కొనసాగుతుందని , మిగిలిన ప్రిమియంలను కుటుంబసభ్యులు కట్టనవసరం లేదని వెల్లడించారు. తదనందరం మెచ్యూరిటీ కూడా అందజేస్తామన్నారు. చిన్నారుల భవిష్యత్తు కోసం రూపొందించిన పాలసీ ప్రయోజనాలను వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్బీఐ లైఫ్ యూనిట్ మేనెజర్లు సురేందర్ రెడ్డి, జక్కుల అన్వేష్ యాదవ్, అలువాల శ్రీనివాసయాదవ్, మహేశుని శివానంద్, లైఫ్
మిత్ర ఎల్లయ్య, సిబ్బంది ఉన్నారు.