లాహోర్: ఇటీవలే మొదలైన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో కలకలం రేపిన మ్యాచ్ ఫిక్సింగ్ ఉదంతంలో పాక్ క్రికెటర్ ఫకార్ జమాన్‌పై రెండు మ్యాచ్‌ల నిషేధం పడింది. మార్చి 29న గడాఫీ స్టేడియంలో కరాచీ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా లాహోర్ ఖలందర్స్ తరఫున ఆడుతున్న ఫకార్.. కెప్టెన్ షహీన్, పేసర్ రవూఫ్‌తో కలిసి ఉద్దేశపూర్వకంగానే బంతి ఆకారాన్ని మార్చారని ఆరోపణలు వచ్చాయి.
దీనిపై ఫీల్డ్ అంపైర్లు, థర్డ్, ఫోర్త్ అంపైర్‌తో పాటు మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామా ఇచ్చిన నివేదిక మేరకు ఫకార్పై పాక్ క్రికెట్ బోర్డు చర్యలకు దిగింది. పీఎస్ఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం లెవల్-3 ఉల్లంఘన కింద ఫకార్పై చర్యలు తీసుకున్నట్టు పీసీబీ తెలిపింది.