Viral Video | సీఎం రేవంత్ రెడ్డిని కలవాలంటే నాకు మెసేజ్ చేయండి అంటూ పోలీస్ డ్రెస్సులో ఉన్న ఓ వ్యక్తి చేసిన వీడియోలు సోషల్మీడియాలో ఇటీవల వైరల్ అయ్యాయి. సచివాలయం ఎంట్రీ గేటు లోపల ఈ వీడియోలు చేయడంతో సంచలనంగా మారాయి. దీంతో ఈ ఘటనపై సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నిఖిల్ యాదవ్ అనే ఐడీతో ఉన్న అకౌంట్లో ఈ వీడియోలు ఉండటంతో అతను ఎవరా అని పోలీసులు ఆరా తీస్తు్న్నారు. పాతబస్తీలో డ్రెస్ కొని సీఎం రేవంత్ రెడ్డిని కల్పిస్తానని, ఐపీఎల్ టికెట్లు ఇప్పిస్తానని నిఖిల్ వీడియోలు చేసినట్లు గుర్తించారు. అతనిపై ఏపీలో పలు పోలీస్ స్టేషన్లలో చీటింగ్ కేసులు నమోదైనట్లు సమాచారం.
అతను అసలు పోలీసే కాదు!
ఇదీ రేవంత్ రెడ్డి ప్రభుత్వ పనితీరు
పోలీస్ డ్రెస్ వేసుకొని సీఎం రేవంత్ రెడ్డిని కల్పిస్తానని ఏకంగా సెక్రటేరియట్లో వీడియోలు చేసిన చీటర్ నిఖిల్
సోషల్ వీడియోలు వైరల్ కావడంతో పోలీస్ విచారణలో వెల్లడి. నిఖిల్ కోసం గాలిస్తున్న పోలీసులు
రీల్స్ కోసం పాత బస్తీలో… https://t.co/88Ms5OOsHm pic.twitter.com/NhyxSvdKpV
— Telugu Scribe (@TeluguScribe) April 29, 2026
సెక్రటేరియట్లో భద్రతా లోపం అనేది ఇది మొదటిసారి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత డజన్ మంది దాకా ఇలా ఫేక్ ఐడెంటిటీతో సెక్రటేరియట్లోకి ఎంటర్ అయ్యారు. తాజాగా నిఖిల్ యాదవ్ కూడా ఇలాగే వీడియోలు తీసి సోషల్మీడియాలో పోస్టు చేశారు. దీనిపై తెలంగాణ సమాజం తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది. ఇలాంటి చీటర్లు సెక్రటేరియట్లోకి చొరబడి.. ఏకంగా ముఖ్యమంత్రినే కల్పిస్తానని వీడియోలు పెడుతుంటూ నిఘా వర్గాలు చోద్యం చూస్తున్నాయని మండిపడుతుంది. సచివాలయం గేటు దాటి లోపలికి వెళ్లి రీల్స్ చేయడానికి అనుమతి ఇచ్చింది ఎవరు అని ప్రశ్నిస్తుంది.