Dacoit | టాలీవుడ్ యువ కథానాయకుడు అడివి శేష్, అందాల నటి మృణాల్ ఠాకూర్ కలిసి నటించిన యాక్షన్ ప్రేమకథ డెకాయిట్ ఇప్పుడు డిజిటల్ వేదికపైకి రానుంది. థియేటర్లలో విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం మంచి వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. విడుదలై మూడు వారాలు దాటినా కూడా వారాంతాల్లో గట్టి కలెక్షన్స్ రావడం ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధిస్తుందనేది తెలియజేస్తుంది. ఈ విజయానికి ప్రధాన కారణం హీరో అడివి శేష్ సహజ నటన, మృణాల్ ఠాకూర్ అభినయం. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో అందించిన నేపథ్య సంగీతం సినిమా భావోద్వేగాలను మరింత ఎలివేట్ చేసింది. కథలో యాక్షన్, ఎమోషన్, ప్రేమ వంటి అంశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి..
ఇప్పుడు ఇదే చిత్రం ఓటీటీలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ప్రముఖ డిజిటల్ వేదిక నెట్ఫ్లిక్స్ ఈ చిత్ర స్ట్రీమింగ్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు సమాచారం. తాజా అప్డేట్స్ ప్రకారం, మే 8 నుంచి దేశవ్యాప్తంగా పలు భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, డిజిటల్ రిలీజ్ దాదాపు ఖరారైనట్టే తెలుస్తోంది.థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులకు, లేదా మరోసారి ఈ యాక్షన్ ప్రేమకథను ఆస్వాదించాలనుకునే వారికి ఇది మంచి అవకాశంగా భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత సుప్రియ యార్లగడ్డ నిర్మించారు.
థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ‘డెకాయిట్’ ఇప్పుడు ఓటీటీ వేదికపై కూడా అదే స్థాయి స్పందనను అందుకుంటుందా..? డిజిటల్ రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో అనేది ఆసక్తికరంగా మారింది. యాక్షన్ లవ్ స్టోరీ చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఓటీటీలో ఎలాంటి రికార్డ్స్ అందుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.