హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : ‘నేను ఏసీబీ అధికారిని. హైదరాబాద్ హెడ్ ఆఫీసు నుంచి మా ట్లాడుతున్నా. మీకు లంచం తీసుకుంటున్నట్టు మా దృష్టికి వచ్చింది. కొంత డబ్బులిస్తే మీపై కేసు కాకుండా చూస్తాం. ఏసీబీ రైడ్ ఎప్పుడు జరుగుతుందో మీకు చెబుతాం. జాగ్రత్తపడండి’ అంటూ ప్రభుత్వ ఉద్యోగులకు కొందరు అక్రమార్కులు కాల్స్ చేస్తున్నారు. ఇటీవల ఈ కాల్స్‌కు భయపడి జనగామకు చెందిన ఇద్దరు మహిళా అధికారులు విడతల వారీగా రూ.70 వేలు సమర్పించుకున్నారు. ఖమ్మంలో నూ ఈ తరహా ఘటనలు నమోదైనట్టు ఏసీబీ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఏసీబీ ఏడీజీ విజయ్‌కుమార్ స్పందించారు. ఈ తరహా కాల్స్‌కు అధికారులు, ప్రజలు డబ్బులు సమర్పించొద్దని, ఏసీబీ అధికారులు అటువంటి కాల్స్ చేయరని స్పష్టం చేశారు.