DTTT Movie | మలయాళ వర్సటైల్ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో, సారా పాలేకర్ కీలక పాత్రలో నటిస్తున్న ఫ్యాంటసీ ఎంటర్టైనర్ ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ‘యు/ఎ’ (U/A) సర్టిఫికేట్ను జారీ చేసింది.
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు శశాంక్ యేలేటి దర్శకత్వం వహించారు. ఆర్కా మీడియా వర్క్స్ మరియు షోవింగ్ బిజినెస్ బ్యానర్లపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. చిన్నపిల్లల నుంచి పెద్దలందరూ ఎంజాయ్ చేసేలా ఒక మ్యాజికల్ అడ్వెంచరస్ ఫ్యాంటసీ కథాంశంతో వస్తున్న ఈ చిత్రం, గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది.