ముంబై: హ్యాపీ స్పేసెస్ ఇండియా(Happy Spaces India) డిజైన్ స్టూడియో.. దేశవ్యాప్తంగా తన ప్రత్యేకత చాటుకుంటున్నది. ఎన్నో సంస్థలకు వర్క్‌ప్లేస్‌లను అందంగా రూపొందించిన ఆ సంస్థకు ఇప్పుడు పదేళ్లు నిండాయి. వివిధ రకాల కంపెనీలను ఆకర్షణీయంగా మార్చిన ఘనత ఆ కంపెనీకి దక్కుతోంది. పని ప్రదేశాలను కొత్త అందాలతో తీర్చిదిద్దతూ.. ఆయా కంపెనీ ఉద్యోగుల్లో తమ కళాత్మక సందేశాలతో ఉత్తేజాన్ని నింపుతోంది. సుమారు 16 నగరాల్లోని దాదాపు 2.5 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలోని వర్క్‌ప్లేస్‌లను సుందరీకరణ చేసింది ఆ సంస్థ.
ఎన్నో ప్రఖ్యాత కంపెనీలకు వర్క్‌ప్లేస్‌లను డిజైన్ చేసింది హ్యాపీ స్పేసెస్ ఇండియా. టాటా కెమికల్స్, రోల్స్ రాయ్స్, డీ బీర్స్, క్రిసెల్, జైడస్, గోద్రేజ్, ఆంబిట్, ఎస్కేఎఫ్, గ్రీవ్స్ కాటన్, ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్, ఆమ్డాకస్, బ్రిడ్జ్‌స్టోన్ లాంటి కంపెనీలు హ్యాపీ స్పేసెస్ ఇండియా డిజైన్ చేసిన వర్క్ప్లేస్లనే వాడుతున్నాయి. హ్యాపీ స్పేసెస్ ఇండియా డిజైన్ స్టూడియోను ఎలిగ్జిర్ ఇంటిగ్రేటెడ్ బ్రాండ్కామ్ స్థాపించింది. 2016లో గణేశ్ గడ్కే ఆ సంస్థను స్థాపించారు. కో ఫౌండర్‌గా పల్లవి గడ్కే కొనసాగుతున్నారు.
పని ప్రదేశాలను థీమాటిక్‌గా మారుస్తూ.. తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నది హ్యాపీ స్పేసెస్ ఇండియా(https://happyspacesindia.com) సంస్థ. వర్క్‌ప్లేస్‌లో ఉండే ఖాళీ స్థలాన్ని, అక్కడి గోడలను .. తమ కాన్వస్ అందాలతో చూడముచ్చటగా రూపొందిస్తోంది. పిక్సెల్స్ అందాలనే కాదు.. ఆర్కిటెక్చర్ ఆర్ట్‌ను కూడా ఆ డిజైన్ స్టూడియో ప్రజెంట్ చేస్తోంది. మనసుకు నచ్చే మనోహర సందేశాలను తన డిజైన్‌లో వ్యక్తపరుస్తూ ఆ సంస్థ అందర్నీ ఆకర్షిస్తున్నది. గ్రాఫిటీ వాల్స్‌ను క్రియేట్ చేయడంలో ఎంతో శ్రద్ధ చూపిస్తున్నది. కేవలం లోగోలను తీర్చిదిద్దడమే కాదు.. కల్చర్, విలువలు, బ్రాండ్ ఇమేజ్ను కూడా ఆయా సంస్థలకు తగినరీతిలో డిజైన్ చేస్తోంది.