దామరచర్ల, ఏప్రిల్ 23 : దామరచర్ల మండలంలో ఉపాధి హామీ పనులు చేపడుతున్న ప్రాంతాల్లో కూలీలకు సదుపాయాలు, వసతులు ఏర్పాటు చేయాలని డీఆర్డీఓ శేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దామరచర్ల మండలంలోని తాళ్లవీరప్పగూడెం, దామరచర్ల, కొండ్రపోలు గ్రామ పంచాయతీ పరిధిలో చేపట్టిన ఉపాధి హామీ పనులను గురువారం పరిశీలించారు. ఆయా గ్రామాలలోని నర్సరీ పనులను, ధాన్యం కొనుగోలు కేంద్రం ను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపాధి కూలీలకు ఎండాకాలం నందు మంచినీళ్ల వసతి, టెంట్లు ఏర్పాటు, ఫస్ట్ ఎయిడ్ కిట్‌ను ఏర్పాటు చేసి, ఓఆర్ఎస్ ప్యాకెట్లను కూలీలకు అందుబాటులో ఉంచాలని ఎంపీడీఓ అలివేలుమంగమ్మను, ఏపీఓ నాగేశ్వరరావును ఆదేశించారు.
మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో నర్సరీ పనులు మంచిగా జరుగునట్లు చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఎండాకాలం నందు ఉదయం 6 గంటలకు ఉపాధి పనులకు వచ్చి 11 గంటల వరకు పూర్తి చేసుకునేలా చూడాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీలోని అందరూ కూలీలు ఉపాధి హామీ పనులను ఎక్కువ మొత్తంలో ఉపయోగించుకుని ఈ ఎండాకాలంలో ఉపాధి హామీ సంబంధించిన డబ్బులు ఎక్కువ మొత్తంలో లబ్ధి పొందాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం కృష్ణమూర్తి, తాళ్లవీరప్పగూడెం గ్రామ సర్పంచ్ పోకల వెంకటేశ్వర్లు, ఈసీ శంకర్, టీఏ సైదా, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మండల ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

ఉపాధి కూలీలకు సదుపాయాలు కల్పించాలి : డీఆర్డీఓ శేఖర్ రెడ్డి