
మెదక్ రూరల్, డిసెంబర్ 4: మెదక్ మండలంలో 19 గ్రామ పంచాయతీలు ఉండగా.. వీటిలో 14 మంది మహిళా సర్పంచ్‌లు ఉండడం విశేషం. మహిళా సర్పంచ్‌లు మగవారికి దీటుగా పాలన కొనసాగిస్తూ గ్రామాల అభివృద్ధికి కృషిచేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం దిశగా పల్లెలు అభివృద్ధిలో పరుగులు తీస్తున్నాయి. ప్రతి పల్లె పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పల్లెప్రగతి కార్యక్రమం నిర్వహిస్తూ గ్రామాల రూపురేఖలు మార్చుతున్నది. దీనిని మహిళా సర్పంచ్‌లు అందిపుచ్చుకుంటున్నారు. గ్రామాల అభివృద్ధిలో కీలకమైన గ్రామపంచాయతీల్లో సర్పంచులుగా ఎన్నికై తమదైన మార్క్‌ను చూపిస్తున్నారు. ఓవైపు కుటుంబ బాధ్యతలు చక్కదిద్దడంతో పాటు గ్రామపంచాయతీలోని విధినిర్వహణను చక్కగా నిర్వర్తిస్తూ గ్రామాలను ఆదర్శంగా తీర్చదిద్దుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతిలో ప్రణాళికను ఆయా గ్రామాల్లో అమలు చేస్తున్నారు. పల్లెలో ఇంటింటికీ పారిశుధ్యంపై అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైత్యనం తీసుకొస్తున్నారు. గ్రామాల్లో ఆహ్లాదాన్ని పంచుతూ ఆకట్టుకునే మొక్కలు , పచ్చదనాన్ని పెంపొందించడం కోసం పల్లె ప్రకృతివనం, నర్సరీ, వైకుంఠధామం,తడిపొడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేయడానికి డంపింగ్‌యార్డులు, స్వచ్ఛమైన తాగునీటి కోసం మిషన్ భగీరథ ట్యాంకులు, ప్రధాన వీధుల్లో మిరుమిట్లు గొలిపే ఎల్ఈడీ బల్పులు, సీసీ రోడ్లు, బహిరంగ మలవిసర్జన నిర్మూలన కోసం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పరిశుభ్రతను పెంపొ ందించే భూగర్భ డైనేజీ, రైతు వేదికల నిర్మాణాలను సకాలంలో పూరి చేసి స్ఫూర్తిగా నిలుస్త్తున్నారు. సీ ఎం కేసీఆర్ పిలుపుమేరకు హరితహారం కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేస్తూ మ హిళా సర్పంచులు పల్లెలను పచ్చటి లోగిళ్లుగా మారుస్తున్నా రు. తడి, పొడి చెత్త సేకరణకు పంచాయతీ ట్రాక్ట ర్, మొక్కలకు నీరిందించేందు కు నీటి ట్యాంకర్ తదితర వసతులతో అభివృద్ధిలో గ్రామాలు దూసుకుపోతున్నా యి.
భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది..
మహిళలు వంటింటికే పరిమితం కాకుండా పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో రాణిస్తున్నా రు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా రాణిస్తున్నాను. మా గ్రామాభివృద్ధ్దిలో సర్పంచ్‌గా నేను భాగ్యస్వామ్యం కావడం ఆ నందాన్నిస్తోంది.గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేశాం.
పారిశుధ్యం, ప్రగతికి ప్రాధాన్యం
మా గ్రామంలో పల్లెప్రగతి కార్యక్రమా న్ని పక్కాగా అమలు చేస్తున్నాం. పారిశుధ్యానికి ప్రాధాన్యమిస్తున్నాం. సమన్వయంలో అభివృద్ధికి కృషిచేస్తున్నాం. ప్రజలు వీధుల్లో చెత్త వేయకుండా చెత్తబుట్టలు పంపిణీ చేశాం.వారిలో చై తన్యం తేవడానికి నావంతుగా కృషిచేస్తున్నా. పల్లెప్రకృతి వ నం, బృహత్ పల్లెప్రకృతి వనం , పల్లెప్రగతితో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయి. ప్రజలకు సేవ చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నా.
-స్వప్న, ఖాజీపల్లి సర్పంచ్
ప్రభుత్వ నిధులతో అభివృద్ధి..
పల్లెప్రగతికి సీఎం కేసీఆర్ ప్రణాళికలు రూపొందించి నిధులు కేటాయించడం మా అదృష్టం. గ్రామాల రూపురేఖలు మారడం సంతోషంగా ఉంది. ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి, ప్రతి వీధిలో సీసీ రోడ్డు, వీధి దీపాలు ఏర్పాటు చేశాం. ఇంటింటికీ భగీరథ నీరందిస్తున్నాం. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. సర్పంచ్‌గా అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా.
-ప్రేమలత, రాజ్‌పల్లి సర్పంచ్
అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది..
పల్లె ప్రగతితో మాగ్రామ రూపురేఖలు మారిపోయాయి. సీఎం కేసీఆర్ పంచాయతీకి కొత్త ట్రాక్టర్ ఇవ్వడంతో పారిశుధ్య నిర్వహణ బాగుంది. సీజనల్ వ్యాధులు రాకుండా రసాయనాలు పిచికారీ చేయడంతో పాటు హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు ట్యాంకర్ ద్వారా నిత్యం నీటిని పడుతున్నాం. గ్రామాల్లో రోజువారి పనులు నిరాటంకంగా సాగుతుండడంతో గ్రామం శుభ్రంగా మారింది. జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు అందుకోవడం మహిళగా గర్వంగా ఉంది.
-లింగమ్మ, పాతూరు సర్పంచ్