HomeNewsExperts Say That These Insects Can Be Driven Away With Tips
పురుగులు పరార్!
వర్షాకాలంలో క్రిమికీటకాలతో ఇబ్బంది కలుగుతుంది. దోమలు, ఈగలే కాకుండా.. రకరకాల పురుగుల వ్యాప్తి పెరుగుతుంది. వీటితోపాటు అనేక వ్యాధులు కూడా విజృంభిస్తుంటాయి. ఈక్రమంలో కొన్ని సులభమైన చిట్కాలతో ఈ పురుగులను తరిమేయొచ్చని చెబుతున్నారు నిపుణులు.
వర్షాకాలంలో క్రిమికీటకాలతో ఇబ్బంది కలుగుతుంది. దోమలు, ఈగలే కాకుండా.. రకరకాల పురుగుల వ్యాప్తి పెరుగుతుంది. వీటితోపాటు అనేక వ్యాధులు కూడా విజృంభిస్తుంటాయి. ఈక్రమంలో కొన్ని సులభమైన చిట్కాలతో ఈ పురుగులను తరిమేయొచ్చని చెబుతున్నారు నిపుణులు.
ఒక స్ప్రే బాటిల్లో లీటర్ నీళ్లు తీసుకొని.. అందులో కొద్దిగా వేపనూనె కలపాలి. ఈ మిశ్రమాన్ని తలుపులు, కిటికీల దగ్గర స్ప్రే చేస్తే.. ఇంట్లోకి పురుగులు రాకుండా ఉంటాయి.
వెల్లుల్లి రెబ్బల వాసన కూడా దోమలకు పడదు. ఓ రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని చిన్నమంటపై కాలిస్తే వచ్చే వాసనతో.. ఈగలు, ఇతర క్రిమికీటకాలు పరారవుతాయి.
దోమలను తరిమికొట్టేందుకు రసాయన మందులే వాడాల్సిన పనిలేదు. నారింజ తొక్కలను బాగా ఎండబెట్టుకొని.. మెత్తగా పొడిచేసుకోవాలి. ఈ పొడితో పొగబెడితే.. దోమలు నశిస్తాయి.
ఇంట్లో కర్పూరం బిళ్లలు వెలిగిస్తే.. ఆ ఘాటైన వాసనకు దోమలు, ఇతర కీటకాలు పారిపోతాయి.
ఒక పాత్రలో నీళ్లు పోసి.. అందులో కర్పూరం బిళ్లలు వేయాలి. ఆ పాత్రను పడకగదిలోని షెల్ఫ్‌లో పెడితే.. దోమలు రాకుండా ఉంటాయి. గదిమొత్తం సువాసనతో నిండిపోతుంది.
ఇంటిని శుభ్రం చేసేటప్పుడు.. నీళ్లలో ఒక టేబుల్ స్పూన్ పసుపు కలపాలి. దాంతో, ఇంట్లోకి ఈగలు రాకుండా ఉంటాయి. ఇతర క్రిమికీటకాలు కూడా నశిస్తాయి. అన్నిటికన్నా ముఖ్యంగా.. మురికి, తేమ ఉన్న ప్రదేశాల్లోనే క్రిమికీటకాలు పెరుగుతాయి. కాబట్టి.. ముందు పరిశుభ్రత పాటించాలి.
ఇంటి వాతావరణం పొడిగా ఉండేలా చూసుకోవాలి.
చెత్తబుట్టలను వాడటం, క్రమం తప్పకుండా వాటిని ఖాళీ చేయాలి.
ఇంట్లో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
కుండలు, ఇతర పాత్రలలో నీటిని క్రమం తప్పకుండా మార్చాలి.