ఇంటర్ విలీనంతో ప్రైవేట్‌కే మేలు
రాష్ట్రంలో ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి ఉపయోగపడదని, ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు మాత్రమే మేలు జరుగుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు
హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంటర్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేస్తున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి ఉపయోగపడదని, ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకు మాత్రమే మేలు జరుగుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. విద్యారంగంలో మార్పు కోరుతున్నప్పుడు క్షేత్రస్థాయి చర్చలు జరుగాలని అన్నారు. కానీ రేవంత్‌రెడ్డి ఏకపక్షంగా ఇంటర్ బోర్డు రద్దు చేస్తూ పాఠశాల విద్యలో విలీన నిర్ణయం తీసుకున్నట్టు పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థి, ఉపాధ్యాయ, జూనియర్ కళాశాల సంఘాలతో గురువారం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ రాజ్‌బహదూర్ గౌర్ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాష్ట్రంలో 426 ప్రభుత్వ జూనియర్, 1292 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయని అన్నారు. వీటన్నింటిని ఒకేసారి పాఠశాల విద్యలో విలీనం అంటే ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలకే మేలు జరుగుతుందని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

