పిల్లలపై కోవోవాక్స్ టీకా ట్రయల్స్‌కు నిపుణుల కమిటీ నో!
పిల్లలపై కోవోవాక్స్ టీకా ట్రయల్స్‌కు నిపుణుల కమిటీ నో! | సీరం ఇన్స్టిట్యూట్ కోవోవాక్స్ కొవిడ్ టీకా 2-17 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలపై ఫేజ్-2, 3 ట్రయల్స్ నిర్వహించొద్దని సెంట్రల్ డ్రగ్ అథారిటీ నిపుణుల కమిటీ సిఫారసు చేసింది.

న్యూఢిల్లీ : సీరం ఇన్స్టిట్యూట్ కోవోవాక్స్ కొవిడ్ టీకా 2-17 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలపై ఫేజ్-2, 3 ట్రయల్స్ నిర్వహించొద్దని సెంట్రల్ డ్రగ్ అథారిటీ నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. అయితే, పెద్దలపై మొదట ట్రయల్స్ పూర్తి చేయాలని ప్యానెల్ సీరం సంస్థకు సూచించింది. సీరం దేశవ్యాప్తంగా పది కేంద్రాల్లో 2-11, 12-17 సంవత్సరాల మధ్య 920 మంది పిల్లలపై వ్యాక్సిన్ ట్రయల్స్ కోసం డీసీజీఐకి దరఖాస్తు చేసింది. సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్‌కు చెందిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఈసీ) కూడా ఏ దేశంలోనూ వ్యాక్సిన్‌ను ఆమోదించలేదని పేర్కొంది. అమెరికాకు చెందిన నోవావాక్స్ ఇంక్ సంస్థ ఎన్వీఎక్స్ కోవ్ 2373 పేరిట అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను భారత్‌లో ఉత్పత్తి చేసేందుకు సీరం కంపెనీ ఒప్పందం చేసుకుంది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో వ్యాక్సిన్ ఎన్వీఎక్స్-2373 టీకా మితమైన, తీవ్రమైన కేసుల్లో వందశాతం ప్రభావంతంగా పని చేస్తున్నట్లు తేలింది. మొత్తంగా 90.4 శాతం సమర్థతతను చూపిందని జూన్ 14న నోవావాక్స్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి?
Monsoon Diseases: వర్షాకాలంలో ఈ వ్యాధులతో ముప్పు.. జర పైలం
MMTS : నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని రైళ్లు
ఫెడరల్ జడ్జిగా ఇండో అమెరికన్‌ను నామినేట్ చేసిన బైడెన్
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
Heat waves : దేశ రాజధానిలో దంచికొట్టిన ఎండ
త్వరలో అందుబాటులోకి మరో టీకా.. అనుమతి కోసం డీసీజీఐకి జైడస్ దరఖాస్తు
పెరిగిన వంట గ్యాస్ ధరలు.. రూ.25.50 పెంపు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

