పెరిగిన వంట గ్యాస్ ధరలు.. రూ.25.50 పెంపు
పెరిగిన వంట గ్యాస్ ధరలు.. రూ.25.50 పెంపు | చమురు కంపెనీలు గురువారం వంటగ్యాస్ ధరలను పెంచాయి. 12.2 కిలోల బరువున్న సబ్సిడీ సిలిండర్‌పై రూ.25.50 పెంచాయి.

న్యూఢిల్లీ : చమురు కంపెనీలు గురువారం వంటగ్యాస్ ధరలను పెంచాయి. 12.2 కిలోల బరువున్న సబ్సిడీ సిలిండర్‌పై రూ.25.50 పెంచాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అములులోకి వస్తాయని స్పష్టం చేశాయి. పెంచిన ధరతో దేశ రాజధానిలో సిలిండర్ ధర రూ.834.50కు చేరింది. మరో వైపు 19 కిలోల సిలిండర్‌పై సైతం రూ.76 పెరిగింది. దీంతో దేశ రాజధానిలో వాణిజ్య సిలిండర్ ధర రూ.1550కు చేరువైంది. హైదరాబాద్‌లో వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.16 పెరిగింది.
ప్రస్తుతం ధర రూ.861 ఉండగా.. పెంపుతో రూ.877.50కు చేరింది. వాణిజ్య సిలిండర్‌పై రూ.84 పెరగ్గా.. రూ.1768కు పెరిగింది. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) లేదా కిచెన్ గ్యాస్ రేట్లు ఇవాళ సవరించాయి. ప్రతి ఐదురోజులకోసారి అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా చమురు కంపెనీలు ఎల్పీజీ ధరలను సవరిస్తాయి.
గత నెలలో వాణిజ్య సిలిండర్ల ధర రూ.122కు చమురు కంపెనీలు తగ్గించాయి. దీంతో 19 కిలో సిలిండర్ రూ.1473.50కు తగ్గింది. అయితే, సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ ఏడాది జనవరి నుంచి సబ్సిడీ సిలిండర్ల ధరలు దాదాపు ఐదుసార్లు పెరిగాయి. చివరి సారిగా మార్చిలో ధరలు పైకి కదిలాయి.
ఇవి కూడా చదవండి..
ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి?
Monsoon Diseases: వర్షాకాలంలో ఈ వ్యాధులతో ముప్పు.. జర పైలం
MMTS : నేటి నుంచి అందుబాటులోకి మరిన్ని రైళ్లు
ఫెడరల్ జడ్జిగా ఇండో అమెరికన్‌ను నామినేట్ చేసిన బైడెన్
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు
Heat waves : దేశ రాజధానిలో దంచికొట్టిన ఎండ
త్వరలో అందుబాటులోకి మరో టీకా.. అనుమతి కోసం డీసీజీఐకి జైడస్ దరఖాస్తు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

