హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ సీఎంఆర్ఎఫ్కు రూ.45,72,836 ఫండ్ అందించింది. బుధవారం బీఆర్కేభవన్లో సీఎస్ సోమేశ్‌కుమార్‌కు సొసైటీ కార్యదర్శి ప్రభాశంకర్ చెక్‌ను అందజేశారు. సుమారు 80 ఏండ్లుగా ప్రతిఏటా నుమాయిష్ నిర్వహించడాన్ని సీఎస్ అభినందించారు. సంస్కృతి, వైవిధధ్యాన్ని కాపాడటంతోపాటు 18 విద్యాసంస్థలను నడుపుతూ సమాజాభివృద్ధికి కృషిచేయడంపై హర్షం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో సొసైటీ జాయింట్ సెక్రటరీ జానకీరామ్, కోశాధికారి హనుమంతరావు పాల్గొన్నారు.