అమరావతి : తిరుపతిలో తొక్కిసలాట ఘటనకు బాధ్యులైన కీలక అధికారులపై చర్యలు తీసుకోకపోవడం దారుణమని వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా (Roja) అన్నారు. తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారని శుక్రవారం ఎక్స్ వేదిక ద్వారా ప్రశ్నించారు. ఈ ఘటన కు టీటీడీ చైర్మన్, ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ సుబ్బారాయుడు ప్రధాన కారణమని ఆరోపించారు.
ప్రాణాలు తీసిన వారిని ఎందుకు కాపాడుతున్నారు..?
వైకుంఠ ఏకాదశి దర్శన టోకన్లు పొందడం కోసం పరితపించిన భక్తులు..!!
కానీ @JaiTDP @JanaSenaParty @BJP4Andhra ప్రభుత్వం మరియు @TTDevasthanams నిర్లక్ష్యం కారణంగా 6 మంది తమ ప్రాణాలను కోల్పోయారు.
ఈ ఘటన కు టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈఓ వెంకయ్య…— Roja Selvamani (@RojaSelvamaniRK) January 10, 2025
ప్రజల్లో ఆగ్రహాం రావడంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉన్నతాధికారులపై చర్యలు కోసం అంగీకరించారని పేర్కొన్నారు. విధినిర్వహణలో పాలక మండలి, అధికారులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో లపై చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ ఎందుకు అడగటం లేదని ప్రశ్నించారు.
సమాజంలో ఉన్న అభిప్రాయం తాను చెప్పడం ద్వారా ప్రజలు మెప్పు పొందటం చంద్రాబాబుకు ఇష్టమైన అధికారులపై చర్యలు కోరకుండా తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకుంటున్నారని పవన్ కల్యాణ్‌పై ధ్వజమెత్తారు. ఇదేనా మీ సనాతన ధర్మం..? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తిరుపతికి వేర్వేరుగా వచ్చారంటేనే మీ వ్యూహం అర్ధమవుతుందని విమర్శించారు.