నాగర్ కర్నూల్: ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన ( Healthy Lifestyle ) జీవనశైలిని అలవర్చుకోవాలని ఇన్చార్జి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ( Incharge DMHO ) డాక్టర్ రవికుమార్ నాయక్ ( Ravikumar Naik ) అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం నాగర్కర్నూల్ జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రపంచ అధిక రక్తపోటు దినోత్సవ అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ నినాదం ప్రకారం రక్తపోటు స్థాయిని తెలుసుకొని అదుపులో ఉంచుకోవాలన్నారు. ఆరోగ్యకరమైన జీవిత కాలాన్ని పెంచుకొని రక్తపోటును అదుపులో, నియంత్రణలో ఉంచుకోకపోవడం వలన గుండె( Heart), మూత్రపిండాల వైఫల్యం ( Kidneys Failure ), పక్షవాతం వస్తుందని అన్నారు. అధిక రక్తపోటు సైలెంట్ కిల్లర్ అని, ఎటువంటి లక్షణాలు లేకుండానే శరీరంలోని మెదడు, కండ్లు, గుండె, రక్తనాళాలు మూత్రపిండాలు తదితర అవయవాలను నిర్వీర్యం చేస్తుందనారు.
30 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరూ వారి రక్తపోటు స్థాయిని ప్రతి సంవత్సరం పరీక్షించుకుని తెలుసుకోవాలని సూచించారు. ఒకవేళ అధిక రక్తపోటు ఉందని గుర్తిస్తే ప్రాథమిక దశలోనే చికిత్స తీసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. ప్రతిరోజు తప్పనిసరిగా వ్యాయామం, నడవడం చేయాలని, మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎన్సీడీ డి ప్రోగ్రాం అధికారి డాక్టర్ కృష్ణమోహన్, వైద్యాధికారి డాక్టర్ సిహెచ్.వాణి, డాక్టర్ చింతపట్ల నీరజ్ కుమార్, డాక్టర్ రామకృష్ణారెడ్డి, డీపీవో రేనయ్య, ఎన్సీడీ నోడల్ పర్సన్ విజయ్ కుమార్, మల్లేష్ , డీపీఎంవో సుకుమార్ రెడ్డి, ఏఎంఓఆర్ శ్రీనివాసులు, పర్యవేక్షణ సిబ్బంది బాదం రాజేష్, జ్యోతి, జిల్లా ఫార్మసీ సూపర్వైజర్ సురేష్ కుమార్, డివిఎల్ఎం కుమార్, ఆరోగ్య కార్యకర్తలు రమేష్ రెడ్డి, రాజ వర్ధన్ రెడ్డి, శ్రీనివాసులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.