రామ్ కార్తీక్, హెబ్బాపటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘తెలిసినవాళ్లు’. విప్లవ్ కోనేటి దర్శకుడు. సిరెంజ్ సినిమా నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం గ్లింప్స్ ఇటీవల విడుదలైంది. దర్శకుడు మాట్లాడుతూ ‘నేటితరం ప్రేక్షకులు మెచ్చే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌కు అందరి నుంచి ఆదరణ లభిస్తోంది. తప్పకుండా చిత్రం కూడా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు. పవిత్ర లోకేష్, జయప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్రీచరణ్ పాకాల, లైన్ ప్రొడ్యూసర్: డాక్టర్ జేకే సిద్దార్థ.