హైదరాబాద్ : రానున్న గ్రాడ్యుయేట్ ( Eligible Graduate) ఎమ్మెల్సీ ఎన్నికలకు ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ ఓటరుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav ) కోరారు. సనత్ నగర్ నియోజకవర్గంలోని రాంగోపాల్ పేట డివిజన్ నల్లగుట్ట లో గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సభ్యత్వ నమోదు పత్రాలను పలువురు గ్రాడ్యుయేట్లు ఎమ్మెల్యే తలసాని కి అందజేశారు. బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి గ్రాడ్యుయేట్ లను గుర్తించి ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.