ముంబై: మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. మరాఠా రాజు శంభాజీని చంపిన ఔరంగజేబు గుర్తింపుపై కుక్క కూడా మూత్రం పోయదని అన్నారు. ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఔరంగజేబు సమాధికి నివాళి అర్పించడం చూసి మీరు సిగ్గుతో తలదించుకోవాలని శివసేనపై మండిపట్టారు. ‘ఒవైసీ, నేను చెప్పేది వినండి. ఔరంగజేబు గుర్తింపుపై కుక్క కూడా మూత్రం పోయదు’ అని వ్యాఖ్యానించారు.
తాము ఎలాంటి తప్పు చేయలేదని, కేవలం హనుమాన్ చాలీసా జపించామని ఫడ్నవీస్ తెలిపారు. హనుమాన్ చాలీసాను పఠించిన తమ పార్టీ ఎంపీ నవనీత్ రాణా దంపతులను అరెస్ట్ చేసిన శివసేన ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. తన కుమారుడి (సీఎం ఉద్ధవ్) హయాంలో హనుమాన్ చాలీసా చదవడం ద్రోహమని, ఔరంగజేబు సమాధిని సందర్శించడం రాష్ట్ర మర్యాద అని బాలా సాహెబ్ ఠాక్రే ఎప్పుడైనా భావించారా? అని ప్రశ్నించారు. శనివారం శివసేన నిర్వహించిన సభను మాస్టర్ సభగా పిలిచారని, అయితే అది నవ్వుల సభలా ఉందని విమర్శించారు. నిన్న జరిగింది కౌరవ సభ అని, నేడు తమ పార్టీది పాండవుల సభ అని ఆయన అన్నారు.
#WATCH | Asadudin Owaisi goes and pays tribute to Aurangzeb on his grave and you keep seeing that, you should feel ashamed of it. Listen to me Owaisi, even a dog will not pee on the identity of Aurangzeb…: Former Maharashtra CM and BJP leader Devendra Fadnavis, in Mumbai pic.twitter.com/odneDyNvtZ
— ANI (@ANI) May 15, 2022