అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై వరుసగా విచారణ జరుపుతున్న అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం మరోమారు వాయిదా పడింది. తిరిగి వచ్చే నెల 5న సమావేశమై స్పీకర్‌ను కౌశిక్‌రెడ్డి కోరిన అంశంతోపాటు బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదులపైనా చర్చించాలని నిర్ణయింయింది.
- ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అంశంపై నవంబర్ 5న భేటీ
- కౌశిక్‌రెడ్డిపై కక్ష సాధింపు సరికాదన్న బీఆర్ఎస్
- విచారణార్హత లేని కేసును మూసేయండి: వేముల
- క్రాస్ ఎగ్జామినేషన్ వినతికి కమిటీ చైర్మన్ తిరసరణ
హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై వచ్చిన ఫిర్యాదులపై వరుసగా విచారణ జరుపుతున్న అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం మరోమారు వాయిదా పడింది. తిరిగి వచ్చే నెల 5న సమావేశమై స్పీకర్‌ను కౌశిక్‌రెడ్డి కోరిన అంశంతోపాటు బీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదులపైనా చర్చించాలని నిర్ణయింయింది. అసెంబ్లీ కమిటీ హాలులో శుక్రవారం ఎథిక్స్ కమిటీ చైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి కమిటీ సభ్యులు వేముల ప్రశాంత్‌రెడ్డి (బీఆర్ఎస్), కూనంనేని సాంబశివరావు (సీపీఐ), పైడి రాకేశ్‌రెడ్డి (బీజేపీ), జీ మధుసూదన్‌రెడ్డి (కాంగ్రెస్) హాజరయ్యారు. కమిటీ సభ్యులు పద్మారావుగౌడ్ (బీఆర్ఎస్), వెడ్మ బొజ్జు (కాంగ్రెస్) వ్యక్తిగత కారణాలతో హాజరుకాలేదు. ఈ సమావేశంలో ఎథిక్స్ కమిటీకి పాడి కౌశిక్‌రెడ్డి ఇటీవల ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్‌రెడ్డి పలు అంశాలను లేవనెత్తారు.
ఆధారాల్లేకుండా చర్యలా?
కౌశిక్‌రెడ్డికి అందజేసిన రెండు నిముషాల వీడియో క్లిప్పులో ఎలాంటి వ్యాఖ్యలు, శబ్దాలూ లేవని.. కేవలం హావభావాలు మాత్రమే ఉన్న విషయాన్ని కమిటీ దృష్టికి వేముల ప్రశాంత్‌రెడ్డి తీసుకొచ్చారు. సభ్యుడి హావభావాల ఆధారంగా చర్యలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఈ కేసుకు ఎంతమాత్రం విచారణార్హత లేదని స్పష్టంచేశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే వివాదం మొదలైందని పేర్కొన్నారు. ఆఫ్ ది మైక్‌లో శ్రీహరి చేసిన, సభా రికార్డుల్లోకి ఎకని రీతిలో ఉన్న వ్యాఖ్యల పూర్తి వీడియో క్లిప్పు కూడా ఇవ్వాలని ప్రశాంత్‌రెడ్డి కోరారు. కౌశిక్‌రెడ్డి వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది. కడియం శ్రీహరి క్రాస్ ఎగ్జామినేషన్‌కు బీఆర్ఎస్ చేసిన వినతిని కమిటీ చైర్మన్ తిరసరించినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
100 రోజులు ఏపీలోఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో ఎత్తింది 65 టీఎంసీలు!
పంటలను ఎండబెడుతున్న కాంగ్రెస్.. కరెంటు, నీళ్లు ఇవ్వడం చేతగాని రేవంత్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

