దేవరుప్పుల, జూన్ 27 : వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, తె లంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఎన్నారైలకు పిలుపునిచ్చారు. అమెరికాలోని డాలస్‌లో ఐటీ కంపెనీల సీఈవోలు, హోటల్స్ అండ్ రెస్టారెంట్ యజమానులు, బిల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఎర్రబెల్లితోపాటు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యా రు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కేసీఆర్ హ యాంలో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రిగా కే టీఆర్ అనేక పేరు మోసిన కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని గుర్తు చేశారు. ప్రస్తుతం రా ష్ట్రంలో దివాలాకోరు ప్రభుత్వం కొనసాగుతున్నదని దుయ్యబట్టారు. ఐటీ కంపెనీల సీఈవోలు కల్యాణ్ భీమనపాటి, సుమంత్ వసం త్, అభిషేక్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ వ్యవస్థాపకులు హరిదోర్నాల, రఘు, కృష్ణారెడ్డి, బి ల్డర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నా రు. కాగా డాలస్‌లో ఎర్రబెల్లి, సుధీర్‌రెడ్డిని తె లుగు విద్యార్థులు కలిసి సన్మానించారు.