రెవెన్యూ మంత్రి ఆదాయం పెరుగుదల.. రాష్ట్ర ఆదాయం తగ్గుదల!
రాష్ట్రంలో రెవెన్యూ శాఖ మంత్రి ఆదాయం గణనీయం గా పెరుగుతుంటే రాష్ట్ర ఆదాయం మాత్రం తగ్గుతున్నదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శనివారం ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్సీలు తకెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధుతో కలిసి ఆయన పాల్గొన్నారు.
- భద్రాచలం ఏజెన్సీలో గిరిజన సొసైటీల ముసుగులో ఇసుక దోపిడీ
- చంద్రబాబు మాటలు విని తెలంగాణ నీటి హక్కులు హరిస్తే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని భవిష్యత్తు తరాలు క్షమించవు
- సీతారామ ప్రాజెక్టును పూర్తిచేసి తెలంగాణ జలహక్కులు కాపాడాలి
- మాజీ మంత్రి పువ్వాడ అజయ్
భద్రాచలం, జూన్ 27 : రాష్ట్రంలో రెవెన్యూ శాఖ మంత్రి ఆదాయం గణనీయం గా పెరుగుతుంటే రాష్ట్ర ఆదాయం మాత్రం తగ్గుతున్నదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శనివారం ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్సీలు తకెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ.. భద్రాచలం ఏజెన్సీలో గిరిజన సొసైటీల ముసుగులో ఇసుక దోపిడీ జరుగుతున్నదని పేర్కొన్నారు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఎటువంటి అభివృద్ధి లేకపోయినా, ఇసుక లారీల ద్వారా ఎమ్మెల్యేకు మాత్రం ఆదాయం వస్తున్నదని ఎద్దేవాచేశారు. పొరపాటున రేవంత్‌రెడ్డిని గద్దెనెకించామని, కేసీఆర్ సారే మళ్లీ వస్తే తమ బతుకులు మారతాయంటూ పేదలు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. రానున్నది మళ్లీ గులాబీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. చంద్రబాబు మాటలు విని తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి నదీజలాల హక్కులను పోగొట్టుకుంటే భవిష్యత్ తరాలు క్షమించవని రేవంత్‌రెడ్డికి హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే భద్రాచలం పట్టణం ముంపునకు గురయ్యే అవకాశం ఉందని, గ తంలో తాను మంత్రిగా ఇదే అంశాన్ని లేవనెత్తానని గుర్తుచేశారు. సీతమ్మసాగర్, సీతా రా మ ప్రాజెక్టులను పూర్తిచేసి తెలంగాణ జల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.
కార్యకర్తలను కాపాడుకుంటాం: తకెళ్లపల్లి
భద్రాచలం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్సీ, ఖమ్మం ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి తకెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. ప్రభుత్వం నిర్వహించే సర్ ప్రోగ్రాంను పరిశీలిస్తూ ఓటు నమోదు సరళిపై అవగాహన కలిగి, బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బూత్ లెవల్ ఏజెంట్లు పార్టీ సూచనలు పాటించాలని ఆదేశించారు.
జిత్తులమారి నక్క ‘తెల్లం’: తాతా మధు
భద్రాచలంలో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెలే ్యగా గెలిచిన తెల్లం వెంకట్రావు ‘జిత్తులమారి నక్క’ అని నియోజకవర్గ ప్రజలందరికీ అర్థమైందని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. ప్రజల గుండెలమీద దెబ్బకొట్టిన ‘తెల్లం’ను భద్రాద్రి రాముడు కూడా క్షమించడని తెలిపారు. బీఆర్ఎస్ అంటే భద్రాచలం అడ్డా అని కార్యకర్తలు మరోసారి నిరూపించే సమ యం ఆసన్నమైందని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్, నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిక
దుమ్ముగూడెం మండలం పెద్దనల్లబెల్లి గ్రా మ పంచాయతీ వార్డు సభ్యుడు పూసం దాసు మాజీ మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీలు తకెళ్లప ల్లి, తాతా మధు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ప్రభుత్వ విధానాలు నచ్చక బీఆర్ఎస్లో చేరుతున్నట్టు దాసు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

