అబుదాబి: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్‌లో వరుసగా రెండో విజయం ఖాతాలో వేసుకుంది. సూపర్-12 గ్రూప్-1లో భాగంగా బుధవారం జరిగిన పోరులో ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీం (29) ఫర్వాలేదనిపించగా.. లిటన్ దాస్ (9), నయీమ్ (5), షకీబ్ (4), అఫిఫ్ (5) విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో తైమల్ మిల్స్ 3, మోయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం స్వల్ప లక్ష్యఛేదనలో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ జాసన్ రాయ్ (38 బంతుల్లో 61; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టడంతో ఇంగ్లండ్ 14.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది.
సంక్షిప్త స్కోర్లు
బంగ్లాదేశ్: 20 ఓవర్లలో 124/9 (ముష్ఫికర్ 29; మిల్స్ 3/27), ఇంగ్లండ్: 14.1 ఓవర్లలో 126/2 (రాయ్ 61; నసుమ్ (1/26).