Hyderabad Accident | రాంగ్ రూట్లో వచ్చిన ఎస్బీఐ ఉద్యోగి.. బస్సు కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
Hyderabad Accident | రాంగ్ రూట్లో బైక్ నడిపిన ఎస్బీఐ ఉద్యోగి నిర్లక్ష్యం ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ప్రాణం తీసింది. తండ్రితో కలిసి కళాశాలకు వెళ్తున్న 21 ఏళ్ల యువతి.. ఎదురుగా వేగంగా వచ్చిన అతడి ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు కిందపడిపోయింది.
Hyderabad Accident | రాంగ్ రూట్లో బైక్ నడిపిన ఎస్బీఐ ఉద్యోగి నిర్లక్ష్యం ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని ప్రాణం తీసింది. తండ్రితో కలిసి కళాశాలకు వెళ్తున్న 21 ఏళ్ల యువతి.. ఎదురుగా వేగంగా వచ్చిన అతడి ద్విచక్రవాహనాన్ని తప్పించే క్రమంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు కిందపడిపోయింది. దీంతో తీవ్రంగా గాయపడిన యువతి అక్కడిక్కడే మృతి చెందింది. హైదరాబాద్ నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీలోని హఫీజ్నగర్కు చెందిన మహ్మద్ ఆరీఫ్ కుమార్తె షేక్ ఆయిషా ముస్ఫిరా (21) ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో బీఈ మైనింగ్ మూడో సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం ఆరీఫ్ తన కుమార్తెను ద్విచక్రవాహనంపై కళాశాలకు తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో ఫీవర్ ఆసుపత్రి సిగ్నల్స్ వద్ద షైలా కేఫ్ సమీపానికి చేరుకున్నారు. అదే సమయంలో ఎదురుగా రాంగ్ రూట్లో మరో వ్యక్తి వేగంగా బైక్‌పై దూసుకొచ్చాడు.
దీంతో ఆరీఫ్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఆయన ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి ఎడమవైపు పడిపోయింది. ఆయిషా మాత్రం కుడివైపు రోడ్డుపై పడిపోయింది. అప్పటికే వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద ఆమె పడిపోయింది. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయాలై ఆయిషా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు.
బాధ్యతగల హోదాలో ఉన్న ఓ బ్యాంకు ఉద్యోగి రాంగ్ రూట్.. ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులేస్తున్న 21 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని జీవిత ప్రయాణాన్ని నడిరోడ్డుపై శాశ్వతంగా ముగించేసింది!
ఉస్మానియా వర్సిటీలో మైనింగ్ ఇంజినీరింగ్ చదువుతూ.. రేపటి రోజున ఇంజినీర్‌గా దేశానికి సేవలందించాలని ఎన్నో కలలు కన్న ఆయేషా ముస్ఫిరా ఆశలన్నీ, ఎదురుగా రాంగ్ రూట్లో వచ్చిన నిర్లక్ష్యపు బైక్ వల్ల క్షణాల వ్యవధిలోనే రాలిపోయాయి.
నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సమీపంలో సోమవారం ఉదయం జరిగిన ఈ రోడ్డు ప్రమాదానికి కారణమైన ఎస్బీఐ ఉద్యోగి బీఎం ధర్మరాజును పోలీసులు అరెస్ట్ చేశారు.
కుమార్తెను కాలేజీకి తీసుకెళ్తున్న ఆ తండ్రి.. నిమిషాల వ్యవధిలోనే కళ్లముందే బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో తల్లడిల్లిపోయాడు. అప్పటివరకు నవ్వుతూ మాట్లాడిన కూతురు విగతజీవిగా రోడ్డుపై పడివుండటం చూసి, నిస్సహాయంగా ఆ తండ్రి రోదించిన తీరు అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.
కేవలం రెండు నిమిషాలు ఆదా చేసుకోవాలనే తొందరపాటు ఎవరింటి దీపాన్నో ఆర్పేస్తోంది. సమాజంలో బాధ్యతగా ఉండాల్సిన విద్యావంతులే ఇలా ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం అత్యంత బాధాకరం, క్షమించరాని నేరం!
గుర్తుంచుకోండి.. మీరు తీసుకునే రాంగ్ రూట్.. మరొకరి జీవితానికి రాంగ్ ఎండ్ కాకూడదు!
ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటించండి.. అమాయకుల ప్రాణాలను బలితీసుకోకండి.
@SBIChairman @TheOfficialSBI
#RoadSafety #StopWrongRouteDriving #TrafficDiscipline #HyderabadPolice
— V.C. Sajjanar, IPS (@SajjanarVC_IPS) November 10, 2026
రాంగ్ రూట్లో వచ్చిన ఎస్బీఐ ఉద్యోగి అరెస్ట్
ఈ ప్రమాదానికి కారణమైన వ్యక్తిని ఎస్బీఐ ఉద్యోగి బీఎం ధర్మరాజుగా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తీవ్రంగా స్పందించారు. బాధ్యతగల హోదాలో ఉన్న బ్యాంకు ఉద్యోగి రాంగ్ రూట్లో ప్రయాణించి, ఉజ్వల భవిష్యత్తు ఉన్న 21 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థిని జీవితాన్ని నడిరోడ్డుపై ముగించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో మైనింగ్ ఇంజినీరింగ్ చదువుతూ భవిష్యత్తులో ఇంజినీర్‌గా దేశానికి సేవ చేయాలని ఐషా ఎన్నో కలలు కన్నదని సజ్జనార్ పేర్కొన్నారు. అయితే రాంగ్ రూట్లో వచ్చిన నిర్లక్ష్యపు బైక్ కారణంగా ఆమె ఆశలన్నీ క్షణాల్లోనే ఆవిరయ్యాయని తెలిపారు.
కుమార్తెను కళాశాలకు తీసుకెళ్తున్న ఆ తండ్రి.. కళ్ల ముందే బిడ్డ ప్రాణాలు కోల్పోవడంతో తల్లడిల్లిపోయారని సజ్జనార్ పేర్కొన్నారు. అప్పటివరకు నవ్వుతూ మాట్లాడిన కుమార్తె విగతజీవిగా రోడ్డుపై పడి ఉండటాన్ని చూసి ఆ తండ్రి నిస్సహాయంగా రోదించిన తీరు అక్కడున్న వారందరినీ కలచివేసిందన్నారు.
కేవలం రెండు నిమిషాలు ఆదా చేసుకోవాలనే తొందరపాటు మరొకరి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపుతోందని సజ్జనార్ ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో బాధ్యతగా ఉండాల్సిన విద్యావంతులే ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, తాము తీసుకునే రాంగ్ రూట్ మరొకరి జీవితానికి రాంగ్ ఎండ్ కాకూడదని ఆయన హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలను బలితీసుకోవద్దని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad Accident | రాంగ్ రూట్లో వచ్చిన ఎస్బీఐ ఉద్యోగి.. బస్సు కిందపడి ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
Goat | `ప్రీ రిలీజ్ ఈవెంట్లో సుడిగాలి సుధీర్‌కు దివ్యభారతి షాక్.. హీరో పేరు ప్రస్తావించకుండానే స్పీచ్!
AP News | రూ.500 తిరిగి ఇవ్వలేదని.. వ్యక్తిపై మరిగే నూనె పోసిన మహిళ.. నెల్లూరులో దారుణం
Gang Rape | తుపాకీతో బెదిరించి.. చెల్లెలి కళ్ల ముందే అక్కపై గ్యాంగ్ రేప్.. దీపావళి రాత్రి దారుణం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డుల వేట.. ఆరో రోజు కూడా తగ్గని జోరు, ఒక్కరోజే 1.25 మిలియన్ టికెట్లు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

