Gang Rape | తుపాకీతో బెదిరించి.. చెల్లెలి కళ్ల ముందే అక్కపై గ్యాంగ్ రేప్.. దీపావళి రాత్రి దారుణం
Gang Rape | దీపావళి పండుగ వేళ బిహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకున్నది. తండ్రిని వెతుక్కుంటూ వెళ్లిన అక్కాచెల్లెళ్లపై దుండుగులు దౌర్జన్యంగా వ్యవహరించారు. చెల్లెపై తుపాకీ గురిపెట్టి బెదిరించి, అక్కపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
Gang Rape | దీపావళి పండుగ వేళ బిహార్‌లో దారుణ ఘటన చోటుచేసుకున్నది. తండ్రిని వెతుక్కుంటూ వెళ్లిన అక్కాచెల్లెళ్లపై దుండుగులు దౌర్జన్యంగా వ్యవహరించారు. చెల్లెపై తుపాకీ గురిపెట్టి బెదిరించి, అక్కపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ తతంగమంతా తమ ఫోన్లో వీడియో కూడా తీసుకున్నారు. పట్నా సమీపంలోని బాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. దీపావళి రోజు రాత్రి సుమారు 11 గంటల సమయంలో తండ్రి ఇంటికి రాకపోవడంతో బాధితురాలు తన చెల్లితో కలిసి ఆయన కోసం వెతుకుతూ బయటకు వెళ్లింది. ఇంటి నుంచి కొంత దూరం వెళ్లగానే సమీప గ్రామానికి చెందిన కొందరు యువకులు వారిని అడ్డగించారు. అనంతరం వారి నోటిని బట్టతో కట్టేశారు. అనంతరం చెల్లెలిపై తుపాకీ గురిపెట్టి, వారి ఇంటికి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ దూరంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదంతా తమ ఫోన్లో వీడియో రికార్డు చేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.
ఊహించని ఈ ఘటనతో తీవ్ర భయాందోళనకు గురైన అక్కాచెల్లెళ్లు అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో ఇంటికి చేరుకుని కుటుంబసభ్యులకు విషయం తెలిపారు. ఆ తర్వాత డయల్ 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే బాధితురాలి ఇంటికి చేరుకున్న పోలీసులు, వైద్య పరీక్షల కోసం తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుల్లో ఇద్దర్ని బాబూలాల్ (25), విక్కూ కుమార్ (26)గా గుర్తించారు. వారిని అరెస్టు చేశారు. వీరితో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, బాధితురాలి తల్లి రెండ్లేళ్ల క్రితమే మరణించిందని సమాచారం. అప్పటి నుంచి తండ్రి మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటి నుంచి బయటకు వెళ్లిన తండ్రి ఇంకా రాకపోవడంతో ఆయన్న వెతుక్కుంటూ అక్కాచెల్లెళ్లు బయటకు వెళ్లారు. అలాంటి సమయంలోనే వారిపై ఈ అఘాయిత్యం జరగడం స్థానికంగా కలకలం రేపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gang Rape | తుపాకీతో బెదిరించి.. చెల్లెలి కళ్ల ముందే అక్కపై గ్యాంగ్ రేప్.. దీపావళి రాత్రి దారుణం
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ రికార్డుల వేట.. ఆరో రోజు కూడా తగ్గని జోరు, ఒక్కరోజే 1.25 మిలియన్ టికెట్లు!
Samantha | తొలి వ్యాపారంలోనే భారీ నష్టాలు.. అయినా వెనక్కి తగ్గని సమంత, ఇప్పుడు 10 స్టార్టప్స్‌లో పెట్టుబడులు!
DSPs Transfers | డీఎస్పీల బదిలీలకు రంగం సిద్ధం.. జిల్లాలు, కమిషనరేట్లలో ఖాళీలపై ఉన్నతాధికారుల ఆరా
కాంగ్రెస్ పాలనలో కరోనా కంటే దారుణం.. రెండేళ్లలో భారీగా పడిపోయిన పెట్టుబడులు.. టీజీఐపాస్ గణాంకాల్లో నిగ్గుతేలిన నిజాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

