ENE Repeat Review | ‘ఈఎన్ఈ రిపీట్’ రివ్యూ: స్నేహం, సినిమా పిచ్చితో మరోసారి నవ్వించిన గ్యాంగ్!
TharunBhascker | టాలీవుడ్లో చిన్న సినిమాగా వచ్చి పెద్ద ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన చిత్రం ‘ఈఎన్ఈ రిపీట్’. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. యువతరంలో ఈ సినిమాకు ఉన్న క్రేజ్ కారణంగా ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్‌పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ‘ఈఎన్ఈ రిపీట్’ పేరుతో రూపొందిన ఈ సీక్వెల్లో విశ్వక్సేన్, అభినవ్ గోమటం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకుమాను కీలక పాత్రలు పోషించారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ గురువారం థియేటర్లలోకి వచ్చింది. ‘ఈఎన్ఈ రిపీట్’ ఎలా ఉందంటే?
కథ
వివేక్ (విశ్వక్సేన్), కౌశిక్ (అభినవ్ గోమటం), కార్తిక్ (శ్రీనాథ్ మాగంటి), ఉప్పీ (వెంకటేష్ కాకుమాను) కలిసి ఓ సినిమా చేస్తారు. ఫెయిలవ్వడంతో అప్పులపాలవుతారు. కార్తిక్ సినిమాటోగ్రాఫర్‌గా సెటిలవుతాడు. తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ కీర్తనకు (శివాత్మిక రాజశేఖర్) పెళ్లి కుదురుతుంది. బ్యాచ్‌లర్ పార్టీలో కీర్తనకు కాబోయే భర్త అంకిత్‌ను నలుగురు స్నేహితులు కొడతారు. ఆ గొడవ కారణంగా పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. పెళ్లి కోసం చేసి తాను ఖర్చుపెట్టిన డబ్బులను భరించాలని, లేదంటే పోలీస్ కేసు పెడతానని కీర్తన తండ్రి నలుగురు స్నేహితులకు వార్నింగ్ ఇస్తాడు. ఆ డబ్బు కోసం మళ్లీ వివేక్, కార్తీక్, కౌశిక్, ఉప్పీ ఓ సినిమా చేయాలని నిర్ణయించుకుంటారు. వచ్చిన డబ్బును కీర్తన తండ్రికి ఇవ్వాలని అనుకుంటారు. వారి ప్లాన్ సక్సెస్ అయ్యిందా? సినిమా తీసే క్రమంలో ఆ నలుగురి మధ్య ఎలాంటి గొడవలు తలెత్తాయి? ఈగో, డిప్రెషన్లో మునిగిపోయిన వివేక్‌లో ఎలా మార్పు వచ్చింది? స్నేహితుల గురించి అతడికి తెలిసిన షాకింగ్ నిజం ఏమిటి? కీర్తనకు కార్తిక్ తన ప్రేమను వ్యక్తం చేశాడా? కీర్తన తండ్రిలో మార్పు వచ్చిందా? అన్నదే ఈ మూవీ కథ.
విశ్లేషణ
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో 2018లో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. యువతరం ఆడియెన్స్ ఈ కథలో, అందులోని పాత్రల్లో తమను తాము చూసుకున్నారు. పెద్దగా కథ లేకుండా నలుగురు స్నేహితుల అల్లర్లు, అలకలు, వారి మధ్య గొడవలు, కెరీర్ విషయంలో వారిలో ఉండే కన్ఫ్యూజన్లను సహజంగా తరుణ్ భాస్కర్ ఆవిష్కరించిన తీరు ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది. అదే మ్యాజిక్‌ను సీక్వెల్‌తో రిపీట్ చేయాలని ప్రయత్నించారు తరుణ్ భాస్కర్. కొత్త కథ, కథనాలతో కాకుండా కామెడీతో గట్టెక్కాలని చూశారు. సినిమా ఇండస్ట్రీ నేపథ్యంలో ‘ఈఎన్ఈ రిపీట్’ మూవీ సాగుతుంది. రాజీవ్ కనకాల పాత్ర చనిపోతే సినిమా హిట్టే… టీఎఫ్ఐ (TFI) బాగుండాలి… లాంటి సెంటిమెంట్లను తరుణ్ భాస్కర్ బాగా వాడుకున్నాడు. హీరోలపై, సినిమా ఇండస్ట్రీపై అతడు రాసిన పంచ్‌లు పేలాయి. ఫస్ట్ హాఫ్‌లో కీర్తన తండ్రితో మాట్లాడటానికి వివేక్, కార్తీక్, ఉప్పీ వారి ఇంటికి వచ్చి రచ్చ చేసే సీన్, పబ్‌లో గొడవ, కౌశిక్ డూప్‌గా రోహిత్ నటించే సన్నివేశాల్లో కామెడీ బాగుంది. అదే ఫ్లో మిగిలిన సన్నివేశాల్లో ఉంటే ఈ సీక్వెల్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. సీన్లు సీన్లుగా చూసుకుంటే సినిమా బాగుంది. ఓవరాల్‌గా మాత్రం యావరేజ్‌గా అనిపిస్తుంది.
సర్వైవల్ డ్రామా తీయడానికి స్నేహితులు పడే ఇబ్బందుల్లో సీరియస్‌నెస్, ఎమోషన్ రెండు మిస్సయ్యాయి. ఏది తోస్తే అదే తీసుకుంటూ వెళ్లినట్లుగా అనిపిస్తుంది. కీలకమైన ఎలుగుబంటి ఎపిసోడ్ నవ్వించలేకపోయింది. చివరలో సినిమా ఇండస్ట్రీ గురించి చిన్న మెసేజ్ ఇచ్చాడు తరుణ్ భాస్కర్. డాక్టర్లు చేయలేని కొన్ని పనులను సినిమా చేస్తుందంటూ రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ఆ సీన్‌ను ఇంకాస్త డెప్త్‌గా రాసుకుంటే బాగుండేది. స్నేహితులు గొడవలు పడటానికి సరైన రీజన్స్ కనిపించవు. లవ్‌స్టోరీ కూడా సినిమా నిడివి పెంచడానికే ఉపయోగపడింది. ‘ఈఎన్ఈ రిపీట్’లో అనిల్ రావిపూడి, సందీప్ వంగా, సుజీత్, అనుదీప్‌తో పాటు మరికొందరు డైరెక్టర్లు గెస్ట్ రోల్స్‌లో కనిపించారు. ఈ డైరెక్టర్లు కనిపించే సీన్లకు థియేటర్లలో విజిల్స్ పడతాయి.
నటీనటుల పనితీరు
నలుగురు ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో అభినవ్ ఎక్కువగా నవ్వించాడు. సినిమా డౌన్ అయిన ప్రతిసారి తన కామెడీతో నిలబెట్టే ప్రయత్నం చేశాడు. ఫ్రస్టేటెడ్ డైరెక్టర్ పాత్రలో విశ్వక్సేన్ సీరియస్ నటనతో ఆకట్టుకున్నాడు. ఒకే ఎక్స్ప్రెషన్తో సినిమా మొత్తం కనిపించాడు. కార్తీక్ పాత్రకు శ్రీనాథ్ మాగంటి సెట్ అవ్వలేదు. సినిమా ఎడిటర్ల కష్టాలను చెబుతూ వెంకటేష్ కాకుమాను చెప్పే డైలాగ్స్ నుంచి చక్కటి ఫన్ జనరేట్ అయ్యింది. శివాత్మిక, అనీషా ఆంబ్రోస్లకు తమ యాక్టింగ్ టాలెంట్ చూపించే అవకాశం అంతగా రాలేదు. ప్రియదర్శిని రామ్, మహేష్, జీవన్ కుమార్ తమ పాత్రలకు న్యాయం చేశారు. వివేక్ సాగర్ మ్యూజిక్, అరోన్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. స్టోరీ రైటర్, డైరెక్టర్‌గా కంటే డైలాగ్ రైటర్‌గా తరుణ్ ఎక్కువగా మెప్పించాడు.
కథ పక్కనపెట్టి కామెడీ కోసం చూస్తే సినిమా నచ్చుతుంది. ‘ఈ నగరానికి ఏమైంది’ స్థాయిలో నవ్వులు పండలేదు.
రేటింగ్: 3/5
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Telangana RERA | రెరా.. ఇది తగునా? రియల్ రంగంలో అవినీతికికొమ్ముకాస్తున్నట్లు విమర్శలు
MLA Raja Singh | ఆయన చెప్పింది నిజమే…తెలంగాణలో గుండాల రాజ్యం, అవినీతి రాజ్యం నడుస్తుంది : ఎమ్మెల్యే రాజాసింగ్
Yadagirigutta | యాదగిరిగుట్టలో ప్రారంభమైన కోటి పుష్పార్చన
మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాం : వేల్పుల వేణు గోపాల్
IND vs NZ | హెన్రీ నికోల్స్, గ్లెన్ ఫిలిప్స్ అద్భుత పోరాటం..! కివీస్ స్కోరు 243/5
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

