Koffee with Karan | భారతీయ టెలివిజన్, ఓటీటీ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన సెలబ్రిటీ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’ (Koffee With Karan) త్వరలోనే ముగియనుంది. సుదీర్ఘకాలంగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ ఐకానిక్ షో తాజాగా తన చివరి సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 22 ఏళ్ల ప్రయాణం, 8 విజయవంతమైన సీజన్లు, 161 ఎపిసోడ్లను పూర్తి చేసుకున్న ఈ షో.. ఇప్పుడు సీజన్ 9తో ఫైనల్ రౌండ్‌కు సిద్ధమైంది. ఈ షోకి సంబంధించిన తొమ్మిదవ మరియు ఆఖరి సీజన్‌ను అక్టోబర్ 14 నుండి ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్ (JioHotstar) లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ దర్శకుడు, హోస్ట్ కరణ్ జోహార్ అధికారికంగా ప్రకటించారు.
తాజాగా విడుదలైన ప్రోమోలో కరణ్ జోహార్ కాస్త భావోద్వేగానికి గురయ్యారు. 2004లో తన తండ్రి యశ్ జోహార్‌కు ఈ టాక్ షో ఐడియా చెప్పిన క్షణాలను గుర్తుచేసుకుంటూ, అప్పట్నుంచి ఇప్పటివరకు సాగిన ప్రయాణాన్ని ఆయన నెమరువేసుకున్నారు. బాలీవుడ్ ప్రముఖుల సీక్రెట్స్, వివాదాలు, సరదా సంభాషణలతో పాప్ కల్చర్‌పై చెరగని ముద్ర వేసిన ఈ షోకు చివరిసారిగా ‘ఒక కప్పు కాఫీ’తో వీడ్కోలు పలకనున్నారు. మరోవైపు ఈ ముగింపు సీజన్లో టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్‌తో పాటు విజయ్ దేవరకొండ పాల్గోనబోతున్నట్లు తెలుస్తుంది.