Queen Elizabeth II Death | భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11.21 గంటల సమయంలో బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 (96) మృతి చెందారు. వయస్సుతోపాటు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ గతేడాది అక్టోబర్ నుంచి దవాఖానలో చికిత్స పొందారు. 1922లో ఎలిజబెత్-2 రాణి జన్మించారు. ప్రిన్స్ ఫిలిప్ మౌంట్ బాటన్‌ను 1947లో పెండ్లి చేసుకున్నారు. 22 ఏండ్లకే బ్రిటన్ రాణిగా కిరీటం ధరించారు. విన్స్టన్ చర్చిల్ నుంచి మొదలు లిజ్ ట్రస్ వరకు 14 మంది ప్రధానులను ఆమె పరిపాలన హాయాంలో చూశారు. రెండు రోజుల క్రితం బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన లిజ్ ట్రస్ స్కాట్లాండ్కి వెళ్లి రాణి ఎలిజబెత్‌ను కలుకుకున్నారు. ఆమె భర్త ప్రిన్స్ ఫిలిప్ గతేడాది ఏప్రిల్‌లో మృతి చెందిన సంగతి తెలిసిందే.
గతేడాది అక్టోబర్ నుంచి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఎలిజబెత్ రాణి-2 .. అధికారిక కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. బుధవారం కూడా సీనియర్ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంప్రదింపులు జరుపాల్సి ఉంది. కానీ వైద్యుల సూచనల మేరకు ఆమె ఆ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత అస్వస్థతకు గురైన ఎలిజబెత్ రాణి-2కి ప్రత్యేక వైద్య బృందం చికిత్స అందించింది.