హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ ): రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం మళ్లీ పెరిగింది. గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 336.266 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమైంది. దీంతో పీక్ డిమాండ్ 18,052 మెగావాట్లుగా నమోదైంది. ఈ నెలలో విద్యుత్తు పీక్ డిమాండ్ 18 వేల మెగావాట్లు దాటడం ఇది నాలుగోసారి. రాష్ట్రంలో విద్యుత్త పీక్ డిమాండ్ ఈ నెల 3న 18,139 మెగావాట్లు, 12న 18,095 మెగావాట్లు, 13న 18,228 మెగావాట్లుగా నమోదైంది. కానీ, ఈ నెల 18న పీక్ డిమాండ్ 15,058 మెగావాట్లకు పడిపోయింది. మార్చి రెండో వారం తర్వాత వర్షాలు కురవడమే ఇందుకు కారణం. ఈ నెల 18 తర్వాత మళ్లీ ఎండలు ముదరడంతో విద్యుత్తు వినియోగం, పీక్ డిమాండ్ క్రమంగా పెరుగుతున్నది. ఈ హెచ్చుతగ్గులు అధికారులను కలవరపెడుతున్నాయి.
రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం తీరు తేదీ మిలియన్ యూనిట్లు