గృహావసరాలకు రోజుకు 4 నుంచి 6 గంటలు కోతలు.. పరిశ్రమలకు వారంలో రెండు రోజులు పవర్ హాలిడేలు. అధికారిక లెక్కలు ఇవే అయినా అనధికారికంగా అంతకు మించే విద్యుత్ కోతలు విధించిన సందర్భం.. పవర్‌హాలిడేతో పారిశ్రామిక రంగం కుదేలయింది… పారిశ్రామికవేత్తలు, కార్మికులు రోడ్డెక్కి ధర్నాలు చేశారు. జనరేటర్లు, ఇన్వెర్టర్ల భారంపై లబోదిబోమన్నారు.ఇది ఉమ్మడి రాష్ట్రంలో గ్రేటర్ విద్యుత్ పరిస్థితి.
స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో దక్షిణ తెలంగాణ పంపిణీ సంస్థ (టీఎస్ ఎస్పీడీసీఎల్) అధికారులు చీకట్లను తొలగించారు..వెలుగులను పంచారు.. గృహ వినియోగదారులు, వ్యాపార, వాణిజ్య వర్గాలు, పరిశ్రమలు అన్న తేడాల్లేకుండా అందరికీ అంతరాయం లేని విద్యుత్‌ను అందిస్తున్నారు..ఇలా ఒక రోజు కాదు..రెండు రోజులు కాదు..ఏకంగా ఏడేండ్లుగా అందిస్తుండడం గమనార్హం.
చీకటి నుంచి నిరంతర వెలుగుల్లోకి..
రాష్ట్రం ఏర్పడితే చిమ్మచీకట్లు కమ్ముకుంటాయన్న తెలంగాణలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అనతికాలంలోనే వెలుగులను నింపారు. జూన్ 2, 2014 నుంచి డిసెంబర్ 1, 2014 వరకు (అంటే కేవలం 5 నెలలు) విద్యుత్ కోతలను పూర్తిగా ఎత్తేశారు. ఒకటీ కాదు.. రెండు కాదు.. 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్‌ను అందించి హైదరాబాద్ నగరాన్ని విశ్వనగర అభివృద్ధిలో దక్షిణ తెలంగాణ పంపిణీ సంస్థ కీలక పాత్ర పొషిస్తున్నది.
ఈ ఏడేండ్ల వ్యవధిలో సజావుగా విద్యుత్ సరఫరా చేయడం టీఎస్ ఎస్పీడీసీఎల్ ఘనతగా చెప్పవచ్చు. లైన్ల నిర్వహణ, విపత్తులు సంభవించినప్పుడు తప్పా మిగతా రోజుల్లో నిరాటంకంగా విద్యుత్‌ను అందిస్తుండడం యజ్ఞంగా భావించవచ్చు. 2200 మెగా వాట్ల విద్యుత్ సరఫరా నుంచి ప్రస్తుతం ప్రతి రోజు 3400 మోగా వాట్ల విద్యుత్ వినియోగమవుతుండగా, వేసవిలో అత్యధికంగా 6500 మెగా వాట్ల వరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. శరవేగంగా విస్తరిస్తున్న నగరం, భారీ పెట్టుబడులు, అంతర్జాతీయ సంస్థల రాకతో డిమాండ్ 10 వేల మెగా వాట్లకు చేరుకునే అంచనాతో సంస్థ ఏర్పాట్లు చేస్తున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గౌరవరం రఘుమారెడ్డి తెలిపారు.
ఏడేండ్లలో ప్రగతి ..
పారిశ్రామికవేత్తల ఆత్మైస్థెర్యం పెరిగింది
ఏడేండ్ల నుంచి 24 గంటల కరెంట్ ఇవ్వడం అనేది గొప్ప విషయం. ఈ విధానాన్ని అమలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. విజయవంతంగా కరెంట్ అందించడంతో ఆర్థికంగా రాష్ట్రం ఎదిగింది. ఇది పారిశ్రామిక రంగానికి మరింత ఎనర్జీని ఇచ్చినైట్లెంది. పారిశ్రామికవేత్తలలో ఆత్మైస్థెర్యం పెరిగింది.
పరిశ్రమల నిర్వహణ సులభమైంది
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. 24 గంటల కరెంట్‌ను ప్రభుత్వం సాధ్యం చేసింది. 34 ఏండ్ల నుంచి వ్యాపారంలో ఉన్నాం. ఏ ప్రభుత్వాలు ఇలాంటి సాహసోపేత విధానాన్ని అమలు చేయలేదు. సీఎం కేసీఆర్ 24 గంటల కరెంట్ సమకూర్చడంతో అనేక పరిశ్రమల నిర్వహణ సలుభంగా మారింది.