ఘట్కేసర్,జనవరి 1 : వడ్డెర కులస్తుల అభివృద్ధికి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కృషి చేస్తామని ఘట్కేసర్ చైర్పర్సన్ ఎం.పావనీ జంగయ్య యాదవ్ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా వడ్డెర సంఘం నాయకులు శనివారం చైర్‌పర్సన్‌ను మర్యాదపూర్వకంగా ఆమె నివాసంలో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ వడ్డెర కులస్తుల అభివృద్ధికి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలోని వడ్డెర కులస్తులు నివాసం ఉండే కాలనీల్లో మౌలికవసతులు కల్పిస్తామన్నారు.కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకుడు ఎం. జంగయ్య యాదవ్, వడ్డెర సంఘం నాయకులు పెంటయ్య శ్రీనివాస్, పరుశురాం, రాజు, రూబెన్, రాఘవ, ప్రసాద్, సురేశ్ పాల్గొన్నారు.