
ఉప్పల్, జనవరి 4 : కాలనీల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తామని చిలుకానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్ అన్నారు. డివిజన్లోని సీతారామకాలనీలో మంగళవారం కార్పొరేటర్ పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలోని అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు, తదితర సమస్యలను స్థానికులు కార్పొరేటర్‌కు వివరించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ.. రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలను శుభ్రం చేయాలని సిబ్బందికి సూచించి, పనులు చేయించారు. సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషిచేస్తామని అన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి కొకొండ జగన్, కొండల్‌రెడ్డి, రామానుజన్, మాస శేఖర్, బింగి శ్రీనివాస్, బాలు, శ్యామ్, సీతారామకాలనీ అధ్యక్షుడు బజారు జగన్, గూడూరు రమేశ్, అంజిరెడ్డి, వీరేందర్, శ్రీనివాస్, బాలరాజు, శ్రీనివాస్, నర్సింగ్‌రావు, మోహన్‌రావు, నాగేశ్వర్రావు పాల్గొన్నారు.