
వర్గల్, డిసెంబర్ 3 : దేశంలోని ఇతర రాష్ర్టాల కంటే తెలంగాణలో నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలల విద్యాబోధన భేషుగ్గా ఉందని కర్ణాటక రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ కె.జయప్రకాశ్‌హెగ్డే అన్నారు. శుక్రవారం వర్గల్‌లోని మహాత్మాజ్యోతిరావు పూలే బాలికల డిగ్రీ కళాశాలను తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల బీసీ కమిషన్ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల విద్యార్థినులు రెండు రాష్ర్టాల బీసీ కమిషన్ చైర్మన్లు, సభ్యులకు ఘన స్వాగతం పలికారు. కళాశాల విద్యార్థినులు వివిధ పాఠ్యాంశాల్లో ప్రయోగాత్మకంగా రూపొందించిన పలు ప్రయోగ డాక్యుమెంట్లు, వసతి గృహాలు, లైబ్రరీలు, క్రీడామైదానం, కంప్యూటర్ ల్యాబ్, డైనింగ్హాల్ను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన అతికొద్ది సమయంలోనే రాష్ట్రంలో ఈ తరహా విద్యావిధానం అమలు కావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగా ఇక్కడి విద్యార్థినులు ఆర్ట్, క్రాప్ట్ విద్యలో చేస్తున్న ప్రయోగాలు సంతృప్తినిచ్చాయని తెలిపారు. విద్యార్థిదశ నుంచే వారు చేస్తున్న ప్రయోగాలు ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేస్తాయని కితాబు ఇచ్చారు. గురురుకులాల్లో చదువుతున్న విద్యార్థినులు లక్ష్యాలను ఎంచుకొని ఆ దిశగా ముందుకుసాగినప్పుడే సత్ఫలితాలు పొందుతారని తెలిపారు.
క్యాంపస్‌లో ప్లేస్మెంట్ నిలుపుకోవాలి..
అనంతరం వెనుకబడిన గురుకుల పాఠశాలల రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం గౌడ్ మాట్లాడారు. గురుకుల పాఠశాలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులు అంటే కేవ లం బ్యాక్వార్డు కేటగిరీలో ఉద్యోగాలు పొంద డం కాదు, ఓపెన్ కేటగిరీలో కూడా సత్తాచాటే లా బాగా చదివి ప్రయోజకులు కావాలని కోరా రు. రిజర్వేషన్లలో ఉన్నత చదువులు, ఉద్యోగాలు సాధించడమే కాకుండా సమాజంలో తనకంటూ ప్రత్యేకతను నిలుపుకోవాలన్నారు.
దేశం గర్వపడేలా చదవాలి..
తెలంగాణ రాష్ట్రంలో నడుస్తున్న గురుకుల విద్యాసంస్థలు కార్పొరేట్ విద్యా సంస్థలను తలదన్నేలా మనుగడ సాగిస్తున్నాయని రాష్ట్ర బీసీ కమికషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. క్రమశిక్షణ, ఏకాగ్రత, సమయపాలన, విద్యావినయం, లక్ష్యం కలగలిసిన సమ్మేళనమే గురకుల విద్యాసంస్థల ప్రత్యేకతని అన్నారు. గురుకులాల్లో విద్యాబోధన పొందిన విద్యార్థులు స్వరాష్ట్ర సాధనలో పాలుపంచుకోవడం మరుపురాని ఘట్టమన్నారు. బీసీ కమిషన్ సభ్యులుగా కిశోర్‌గౌడ్, ఉపేందర్ లాంటి సభ్యులు ఉండటం కమిషన్‌కు కొండంత బలం అని అన్నారు. పొరుగు రాష్ర్టాలకు ఐకాన్ స్టడీ మెటీరియల్‌గా మారిన మన గురకుల బోధన తీరు దేశం గర్వపడేలా చేసిందన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శన..
వర్గల్ మహాత్మాజ్యోతిరావు పూలే బాలికల డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న విద్యాబోధనను పరిశీలించేందుకు వచ్చిన కర్ణాటక బీసీ కమిషన్ సభ్యులకు విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కళాశాల సెక ండ్ ఇయర్ విద్యార్థినులు కె.సంధ్య, ఎస్.హారి క ప్రదర్శించిన శివతాండవం, భరతనాట్య నృ త్య ప్రదర్శనలకు కర్ణాటక బీసీ కమిషన్ సభ్యు లు ఫిదా అయ్యా రు. అంతకుముందు వర్గల్ విద్యాధరిణి సరస్వతీ అమ్మవారి ఆలయంలో చదువులతల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో గురకుల పాఠశాలల సొ సైటీ సెక్రెటరీ మల్లయ్య భట్టు, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సరోజినీ, ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్రావు, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు నాగరాజు, కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.